సాధారణంగా ఒకప్పుడు ప్రకటనలను సినీ ఇండస్ట్రీ వారు చేసేవారు కాదు..కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఒక ఫేమస్ సెలబ్రెటీతో తమ కంపెనీ బ్రాండ్ యాడ్స్ చేయటానికి వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. అలా బ్రాండ్ ప్రకటన ఇచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, అమితాబచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరో ఇప్పటికీ కూడా ఏ బ్రాండ్ ను ప్రమోట్ చేయలేదు. కానీ ఆయన సినిమా మాత్రం కోట్లల్లో వసూలు చేస్తోంది. ఇప్పటికీ కూడా ఆయన లైఫ్ సింపుల్ గా గడిపేందుకు ఇష్టపడతారు. ఆయన ఎవరో కాదు రజినీకాంత్
ఈయన 1975లో తమిళ్ చిత్రం అపూర్వరగంగల్ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.. ఈ మూవీ తరువాత అతను వెనుతిరిగి చూడలేదు ..ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. తమిళంతో పాటు తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఆయన ఎన్నో కోట్లు సంపాదించారు దాదాపు ఆయన ఆస్తి విలువ రూ .430 కోట్లు ఉంటుందని అంచనా కానీ ఏ బ్రాండ్ ప్రమోట్ చేయకుండా ఇంత సంపాదించాడు రజనీకాంత్..
మొదట్లో రజిని ఒక్క సినిమాకు రూ.30 వేలు వసూలు చేసేవారు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగానే వసూలు చేస్తున్నారు. ఈ మధ్యనే జైలర్ సినిమా విడుదల అయ్యింది… ఆ చిత్రానికి రూ.110 కోట్లు తీసుకున్నారని సమాచారం. రజిని లగ్జరీ కార్ల విషయానికొస్తే రెండు రోల్స్ రాయల్స్ కార్లు ఉన్నాయి. . ఇంకా చెప్పాలంటే ఇండియాలో మోస్ట్ బ్రాండెడ్ కార్లన్నీ రజిని దగ్గరే ఉన్నాయనే చప్ప వచ్చు. ఇలా ఆయన ఏ బ్రాండ్ ప్రమోట్ చేయకుండానే బాగానే సంపాదించుకున్నాడు.
.