ఆయన కోసమే కళ్యాణ్ రామ్ ఆ హీరోయిన్ ని ప్రేమించడం మానేశారా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి కళ్యాణ్ రామ్ రెండు తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు సుపరిచితమే.. హరికృష్ణ వారసత్వాన్ని అందుపుచ్చుకొని బాల గోపాలుడు అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ తరువాత తొలిచూపులోనే అభిమన్యు అనే రెండు సినిమాలతో ఒకేసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్యనే బింబిసారా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి మనకి తెలుసు ఆ తరువాత అమిగోస్ అనే సినిమా లో నటించాడు కానీ ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ ని సాధించలేకపోయింది. ఇప్పుడు డెవిల్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు కళ్యాణ్ రామ్

Pic Talk: Kalyan Ram's Beautiful 'Family Photo'

డెవిల్ సినిమా తో మళ్లీ అందరి అంచనాలను అందుకోబోతున్నారు.. త్వరలోనే బింబిసారా 2 కూడా ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.. అయితే ఒకానొక సమయంలో వరుస ప్లాపులతో ఉన్న కళ్యాణ్ రామ్ కు అండగా నిలిచింది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తన ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ని ఎంత దూరం పెట్టిన తను మాత్రం వారికి ఎప్పుడూ అండగా ఉంటాడు.

Nandamuri Harikrishna – Jr NTR & Kalyanram

ఇక కళ్యాణ్ రామ్ తన తండ్రి కారణంగా తను గాఢంగా ప్రేమించిన ఒక హీరోయిన్ను వదులుకోవాల్సి వచ్చిందట. ఇక అసలు విషయంలోకి వెళ్లితే కళ్యాణ్ రామ్ తను సినిమాలో చేసిన ఒక హీరోయిన్ తో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడట. అంతేకాకుండా ఆమెను వదిలిపెట్టలేక ఆమెను వెంటపెట్టుకుని ఎక్కడికి పడితే అక్కడికి తిరిగేవాడట. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ కళ్యాణ్ రామ్ ని ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చాడట. అంతేకాదు ఇంకొకసారి ఆ అమ్మాయితో తిరిగితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటే మొహం మీద చెప్పేశాడట

దాంతో తన తండ్రి మాట కాదనకుండా దృష్టినంతా సినిమాలపై పెట్టి ఇంట్లో చూసిన సంబంధాన్ని ఒప్పుకొని స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇక వారిద్దరికీ ఒక కొడుకు ఒక కూతురు ఇలా తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోవలసి వచ్చింది..

Share.