భార్యను పట్టుకొని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్. !!

Google+ Pinterest LinkedIn Tumblr +

మొట్టమొదటిసారి టాలీవుడ్ నుంచి బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డును అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంతోషకరమైన విషయాన్ని తన కుటుంబ సభ్యులతో అలాగే పుష్ప దర్శకుడుతో పుష్ప టీం తో తెగ సందడి చేస్తున్నారు. జాతీయ అవార్డు సాధించిన క్రమంలో బన్నీని విష్ చేయటానికి ప్రయత్నించగా కాసేపు ఉండండి… నేను ఈ విషయం నమ్మలేకపోతున్నాను అంటూ.. బన్నీ తనను తాను నమ్మలేకపోయాడట.ఈ విషయాన్ని తన భార్య స్నేహారెడ్డి కి చెప్పి తనని పట్టుకొని ఏడ్చేసాడట.. అంతేకాకుండా తన పిల్లలను దగ్గరకు తీసుకొని ముద్దాడట

Viral video: Allu Arjun hugs and kisses wife Sneha Reddy after National  Award win - India Today

అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆశీర్వాదాలు తీసుకొని తండ్రిని కూడా ముద్దాడి తన సంతోషాన్నంత వెల్లడించారు. ఆ తర్వాత ఈ సందర్భంగా పుష్ప టిమ్ ని బన్నీని విష్ చేశారు.. ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ ను పట్టుకొని ఏడ్చేసాడు.. పుష్ప సినిమాకు రెండు నేషనల్ అవార్డులు రావడం పట్ల వారి టీం సంతోషన్ని పట్టలేక పోతున్నారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎలాంటి పాత్ర నో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో చిత్తూరు యాసలో అల్లు అర్జున్ అదరగొట్టేశాడు ఊర మాస్ డైలాగ్స్ అలాగే బాడీ లాంగ్వేజ్ ఒక్కటి కాదు సినిమా అంతా సూపర్ హిట్ అని చెప్ప వచ్చు ..ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో నెవర్ బిఫోర్ అనేలా అదరగొట్టేశాడు. బన్నీ ఉత్తమ నటుడిగా గెలవడంతో ఫాన్స్ టాలీవుడ్ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఏదేమైనా బన్నీ కష్టపడినందుకు మంచి ఫలితం దక్కిందని ఆయన అభిమానులు చాలా సంబర పడుతున్నారు.

ప్రస్తుతం పుష్ప-2 చిత్రం షూటింగ్ లు బిజీగా ఉన్నారు ఇందులో హీరోయిన్గా రష్మిక నటించగా.. విధంగా ఫహద్ ఫజిల్ నటిస్తున్నారు.

Share.