టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ పూజ హెగ్డే.. ఈ అమ్మడు మొట్టమొదటిగా ఒక లైలా కోసం, ముకుందా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ..ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది ..ప్రస్తుతానికి ఈమె చేతిలో అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి.
అయితే పూజ నటించిన గత సినిమాలు అన్ని కూడా వరుసగా ప్లాప్ గా నిలవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కనుమరుగయ్యాయి. మొన్నటికి వరకు ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డే కి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే కి ఎవరు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఇద్దరు దర్శకులు మాత్రం ఆమెను తరచూ తన సినిమాల్లోకి తీసుకుంటూ ఉంటారు. వారెవరంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ , హరిష్ శంకర్ కానీ వీరిద్దరు కూడా ఆమెకు హ్యాండ్ ఇచ్చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి..
అయితే ఈ మధ్యనే గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందని వార్తలు వినిపించాయి..ఆమె తప్పుకుందా లేకపోతే చిత్ర బృందం తప్పించిందా అనే విషయం తెలియదు.. త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే లేదనేది పెద్ద షాకింగ్ అంశం అయితే ఇప్పుడు హరి శంకర్ కూడా పూజకి హ్యాండ్ ఇచ్చాడనే విషయం వైరల్ గా మారుతోంది.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు అందులో పూజా హెగ్డే కోసం ఒక పాత్ర సిద్ధం చేసినట్టు వార్తలు వినిపించాయి. కానీ పూజకు బదులుగా సాక్షి వైద్యను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారట. అయితే ఆ సినిమాలో ఈ అమ్మడికి చోటు లేదన్న విషయం తెలిసిపోతుంది. దీంతో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఈమెకు హ్యాండ్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి..
ఇక గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే ని తప్పించడానికి మహేష్ బాబు దర్శకుడు పై ఒత్తిడి ప్రధాన కారణమని తెలుస్తోంది దీంతో పూజా హెగ్డే చేతిలో ఉండే ప్రాజెక్టులు అన్నీ పోయినట్టే ఇక పూజ సినిమాలకు బాయ్ బాయ్ చెప్పటమే తరువాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.