టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ ఓ రేంజ్ లో కొనసాగుతోంది సమంత. ఇప్పుడు ఉన్న హీరోయిన్లలో ఈ హీరోయిన్ కి క్రేజ్ చాలా ఎక్కువ అని చెప్పాలి. సమంత ఈ మధ్యనే ఖుషి, సిటాడేల్ వంటి సినిమా షూటింగ్ లు పూర్తి చేసింది. ఇదిలా వుండగా మరోవైపు మయోసైటిస్ వ్యాధి నుండి పూర్తిగా బయట పడకపోవడంతో ఈ సినిమా షూటింగ్ కారణంగా దుమ్ము, ధూళి అలాగే కెమెరా లైటింగ్ ప్రాబ్లం తో మరోసారి అనారోగ్యానికి గురైంది.
ఇక దాంతో తను ఎలాగైనా మెరుగైన చికిత్సను తీసుకోవాలని.. ఇక్కడైతే తనకు ఎలాంటి అవకాశాలు కనిపించకపోవడంతో అమెరికాకు పయనం అయ్యింది. ఇక న్యూయార్క్ లో ఇండియన్ వాళ్లు నిర్వహించే ఇండిపెండెన్స్ డే రోజున ర్యాలీలో పాల్గొని సందడి చేసింది. అయితే సమంత గురించి ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే ఇప్పటికే సమంతా కి ముంబై, హైదరాబాదులో లగ్జరీ ఇల్లు ఉన్నాయి. అంతేకాకుండా లగ్జరీ కార్లు స్థిరాస్తులు బాగానే ఉన్నట్లు సమాచారం. కానీ ఉన్నట్టుండి సమంత అమెరికాలో ఇల్లు కొన్నట్లు సమాచారం.. అయితే ఉన్నట్టుండి ఇలా అమెరికా లో ఇల్లు కొనడానికి కారణం ఏంటి? ఎప్పుడో ఒకసారి వెళ్లే అమెరికాకి.. కోట్లు ఖర్చు ఇల్లు ఎందుకు కొనుక్కుంది. అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే సమంత అమెరికాలో ఇల్లు కొనుక్కోవటానికి ఒక కారణం ఉంది. అదేంటంటే తను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి మనకు తెలుసు. ఆ వ్యాధికి ట్రీట్మెంట్ కోసం అమెరికాకి వచ్చినప్పుడు హోటల్స్ లో ఉంటే హోటల్ బిల్లు చాలా ఎక్కువ అవుతోందట. అలాగే ఈసారి మయోసైటీస్ నుండి పూర్తిగా బయటపడటం కోసం అమెరికాలో రెండు మూడు నెలలు ఉండి తన జబ్బును పూర్తిగా నయం చేసుకోవాలని అనుకుంటుందట.
అందుకోసమే తనకు అన్ని సౌకర్యాలు ఉండే ఒక ఇంటిని కొనుగోలు చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి నిజంగానే సమంత ఇల్లు కొనుగోలు చేసిందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.