ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది హీరోయిన్ అనుష్క.. ఈ మధ్యనే మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో వచ్చే నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో గా జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి నటించారు.. ఈ సినిమా తో మార్కెట్ ఊహించని స్థాయిలో పెరగగా ఈ సినిమాతో మార్కెట్ మరింత పెరగడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ అనుష్క కొన్ని షాట్స్ క్యూట్ గా మరికొన్ని షార్ట్స్ బొద్దుగా కనిపించాయి..
ఈ సినిమా ట్రైలర్ ని చూస్తుంటే రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉన్న నేపథ్యంలో అనుష్కకు మరో సక్సెస్ అయితే దక్కుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు..అయితే అనుష్క కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ మారుతోంది..అదేంటంటే అనుష్కకు గోర్లు కొరుకోనే అలవాటు ఉందట.. చిన్నప్పటినుంచి అనుష్కకు ఈ అలవాటు ఉండటంతో ఆ అలవాటును మార్చుకోవాలని అనుష్క తెగ ప్రయత్నాలు చేసిందట..కానీ అవన్నీ విఫలమయ్యాయని తెలుస్తోంది.
ఇప్పటికీ కూడా తనకు తెలియకుండా కొన్ని సందర్భాలలో గోర్లు కొరికేస్తూ ఉంటుందట.. ఆ అలవాటును మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు. ఈ విషయం కాస్త పక్కన పెడితే మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి సినిమా తప్ప అనుష్క చేతిలో మరే ప్రాజెక్టు లేదు. అనుష్కనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదా లేకుంటే తనకు ఆఫర్లు రావలేదో తెలియటం లేదని అభిమానులు తెలుపుతున్నారు. ఈ సినిమాకి అనుష్క రూ .6 కోట్ల రూపాయల పారతోషకం తీసుకున్నారని సమాచారం .ఈ సినిమా అయినా అనుష్కని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకు వెళుతుందేమో చూడాలి మరి.