ఈమధ్య ఇండస్ట్రీలో హీరోయిన్లు హీరోలు పెళ్లికి తెగ రెడీ అవుతున్నారు..అప్పట్లో హీరోయిన్ పెళ్లి చేసుకోవాలంటే పుణ్యకాలం కాస్తా దాటేది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ పొజిషన్లో ఉన్నా కూడా పెళ్లి అనే బంధం లోకి అడుగు పెట్టేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు చేసిన హీరోయిన్స్ దగ్గర నుంచి స్టార్ పొజిషన్లో ఉన్న హీరోయిన్ల వరకు ఎవరికీ చెప్పకుండా పెళ్లిళ్లు చేసుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. అయితే ఈ సమయంలోనే ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతోందనే ప్రచారం జరిగింది.
ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకున్నారా ..తన అందంతో తన కర్లీ జుట్టుతో తన స్వీట్ వాయిస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ నిత్యామీనన్ ఈ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతోందట.. ఈ న్యూస్ తెగ వైరల్ మారుతోంది. ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ గా పేరు సంపాదించుకొని సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న నిత్యమీనన్ ఈ మధ్యనే తన స్నేహితుడైన ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతోందని సమాచారం..ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
ఒకప్పుడు నిత్యామీనన్ పెళ్లి వార్త పై ఎన్నోసార్లు రూమర్స్ వచ్చిన జనాలు పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం మలయాళీ ఇండస్ట్రీలో ఈ వార్త మాత్రం తెగ ట్రెండ్ గా అవుతుండటంతో నిజంగానే నిత్య పెళ్లి చేసుకోబోతున్నదని ఆమె అభిమానులు నమ్ముతున్నారు.
అంతేకాకుండా నిత్యామీనన్ పెళ్లి వార్త గురించి పలు సెలబ్రిటీలు నిజమే అంటూ చెప్పుకొచ్చారు. నిత్యామీనన్ బిహేవియర్ లో కూడా చాలా చేంజ్ వచ్చిందని పలువురు నేటిజెన్లు తెలుపుతున్నారు.. దీంతో నిత్యామీనన్ పెళ్లి వార్త తెగ హల్ చల్ చేస్తోంది. వీరందరూ చెప్పింది వింటుంటే నిజంగానే నిత్యమీనన్ నిజంగానే పెళ్లి చేసుకోబోతోందని తెలుస్తోంది.. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.