బుల్లితెర యాంకర్ గా మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న అమ్మడు అనసూయ.. బుల్లితెర పై ఎంతో ప్రేక్షక ఆదరణ సంపాదించుకుంది. ఈ మధ్య వెండితెరపై కూడా వెలిగిపోతోంది. మొట్టమొదటిగా సోగ్గాడే చిన్నినాయన రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల్లో నటించి మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్న అనసూయ అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై అనసూయ రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనవసరం లేదు.
అయితే తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ఏంటంటే అనసూయ ఏడుస్తూ ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోకి శ్రీ రెడ్డి తనదైన స్టైల్ లో స్పందిస్తూ రియాక్ట్ అయ్యింది. ఎందుకురా అనసూయ ఆంటీ ఇలా కన్నీళ్ళతో బాధ పెడతారు అంటూ శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. అయితే ఈ కామెంట్ ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
ఇంతకు అనసూయ ఎందుకు ఏడుస్తుందో మీకు తెలుసా.. చాలామందికి అనసూయ ఎందుకు ఏడుస్తుందో కూడా అర్థం కావడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే అనసూయ లోపల ఒకటి పెట్టుకుని బయటకి ఒకటి మాట్లాడే రకం కాదు మనసులో ఏది అనిపిస్తే అదే బయటకు చెప్పేస్తుంది.. అలాంటి మనస్తత్వం తనది తన భావాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుందని శ్రీరెడ్డి వెల్లడించారు. అయితే అనసూయ గిట్టని వాళ్లు ఎవరు తనకి తప్పుగా కామెంట్స్ చేస్తున్నారని శ్రీ రెడ్డి అన్నారు. అందుకే అనసూయ బాధపడుతుంది. శ్రీ రెడ్డి ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా శ్రీరెడ్డి నా వీడియోలు కూడా దరిద్రమైన కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటివన్నీ తప్పురా అని ఎంత చెప్పినా అలాంటి కామెంట్స్ పెడుతున్నారు. కానీ అనసూయ పై శ్రీ రెడ్డి సమర్థిస్తూ మాట్లాడుతుండడం గమనార్హం ..ఇప్పుడు శ్రీరెడ్డి, అనసూయ పై చేసిన మాటలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.