సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ లాంటి సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఎక్కడ లేదని చెప్పవచ్చు.. నందమూరి, అక్కినేని ,మంచు కుటుంబాలలో కేవలం ఒకరిద్దరూ హీరోలు మాత్రమే సక్సెస్ అవుతున్నారు మెగా ఫ్యామిలీలో మాత్రం ఇప్పటివరకు ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఎక్కువ మంది సక్సెస్ అయ్యారు. చిరంజీవితో ప్రారంభమైన నటన పవన్ కళ్యాణ్, నాగబాబు అలా మెగా ఫ్యామిలీ లో చాలామంది సక్సెస్ అయిన వారు ఉన్నారు.
ఇక యంగ్ స్టార్ లలో రామ్ చరణ్, అల్లు అర్జున్ ,వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, పంజా వైష్ణవ తేజ్ ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ అయితే ఏకాంగా పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నారు. మెగా ఫ్యామిలీలో ఆడవాళ్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది. వారిలో ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి చెప్పాల్సిన పనిలేదు.. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది.
దీంతో సినీ ఇండస్ట్రీకి దూరమై వివాహం చేసుకొని మళ్లీ ఇప్పుడు విడాకులు తీసుకొని సినీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పటికే పలు రకాల వెబ్ సిరీస్లలో నటించిన సక్సెస్ కాలేకపోతోంది నిహారిక.. ఇకపోతే చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదల కూడా గతంలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని చూసిందట ఆ రోజుల్లో ఉదయ్ కిరణ్ యూత్ లో మంచి ఫాన్స్ ఫాన్ ఫాలోయింగ్ ఉన్నది. ఇక సుస్మితకు కూడా అప్పట్లో ఉదయ్ కిరణ్ బాగా నచ్చాడని సినిమాలలో పనిచేయాలని చాలా ఆసక్తిగా ఉన్నప్పుడు అతనితోనే కలిసి నటించాలనుకుందట.
కానీ ఎందుకు కుదరలేదు రియల్ లైఫ్ లోనే కుదరకపోయినా రియల్ లైఫ్ లో మాత్రం వీరిద్దరూ ఒక్కటే అవ్వాలనుకున్నారు.. స్వయంగా చిరంజీవి వెళ్లి ఈ పెళ్లి సంబంధాన్ని కుదిరించుకోవడానికి ఉదయ్ కిరణ్ వద్దకు వెళ్లగా మొదట ఒప్పుకున్నాడు కానీ ఆ తర్వాత ఎందుకో తన కూతురు సెట్ కాదని చెప్పి వెళ్లిపోయారట ఉదయ్ కిరణ్. అలా ఉదయ్ కిరణ్ తో నిశ్చితార్థం జరిపిన తర్వాత ఉదయ్ కిరణ్ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో ఒకసారిగా ఉదయ్ కిరణ్ కెరియర్ డౌన్ అయింది. దీంతో చిరంజీవి ఫ్యామిలీతో పెట్టుకున్నారు కాబట్టి ఉదయ్ కిరణ్ పరిస్థితి ఇలా అయిందని రూమర్స్ కూడా వినిపించాయి..