ఈ మధ్యకాలంలో ప్రముఖ ఆస్ట్రాలజి వేణు స్వామి ఎంత పాపులర్ అయ్యారో చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు సినిమాలకు ముహూర్తాలు పెడుతూ సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ విషయాలను తెలియజేస్తే సోషల్ మీడియాలో తరచు తెలియజేస్తూ మంచి పాపులారిటీ అయ్యారు. ఈ మధ్యకాలంలో వరుసగా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ రాజకీయాలు సినిమా వ్యవహారాల పైన స్పందిస్తు ఉన్నారు.. ప్రస్తుతం వేణు స్వామి అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు..
యూట్యూబ్లో పలు రకాల ఇంటర్వ్యూ ఇస్తూ ఫలానా హీరోయిన్ ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం తానేనని తెలియజేస్తూ ఉంటారు..ఇందులో కొంతవరకు నిజాలు ఉన్నప్పటికీ మరికొన్ని అవాస్తవాలు ఉన్నాయని నేటిజన్స్ సైతం తెలియజేస్తూ ఉంటారు.. గతంలో హీరోయిన్ రష్మిక, ఈషా, నిధి అగర్వాల్, ఇటీవల డింపుల్ హయాతి కూడా పూజలు చేస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బయటికి రావడం జరిగింది..
ముఖ్యంగా నాగచైతన్య, సమంత వివాహం చేసుకున్న సమయంలో వీరిద్దరి జాతకాలు కలవలేదని అందుచేతను ఎక్కువ కాలం వీరు కలిసి జీవించలేరని విషయాన్ని తెలియజేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే దీన్ని ఎవరు కూడా నమ్మలేదు.. కానీ వీరు విడాకులు తీసుకున్న తర్వాత వేణు స్వామి నేను అప్పుడే చెప్పాను కదా అంటూ మరొకసారి పాపులారిటీ అందుకున్నారు. దీంతో వేణు స్వామి చెప్పేటువంటి జాతకాలు నిజమేనని నమ్మబలికాయి.
సోషల్ మీడియాలో ఈయనను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది..తాజాగా మరొక సినీ సెలెబ్రిటీ జంటల విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వేణు స్వామి పలు విషయాలను తెలిపారు ఆ సెలబ్రెటీ జంట ఎవరో కాదు ఈ మధ్యనే ప్రేమించి వివాహం చేసుకున్న ఆది పినిశెట్టి నిక్కి గల్రాని.. పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్న ఈ జంట వీరి జాతకం కలవలేదు అంటూ వీరి విడిపోయే అవకాశాలు 80% ఉన్నాయంటే వేణు స్వామి కామెంట్లు చేశారు. మరి నిజంగానే వీరు విడాకులు తీసుకుంటే వేణు స్వామి పేరు మరొకసారి మారుమోగుతుంది.