సినీ ప్రపంచానికి చెందిన చాలామంది అమ్మాయిలు ఆలోచనలు ఎలా ఉంటాయో ఎవరికి అర్థం కాదు.. ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయంలో తీసుకొనే నిర్ణయాలు కూడా చాలా కఠినంగానే ఉంటాయి.. కొన్నిసార్లు ప్రేమించిన అబ్బాయిలను వదిలేసి మరి విడాకులు తీసుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటూ ఉంటారు.. ఇప్పుడు తాజాగా బుల్లితెర నటి రీతూ చౌదరి కూడా ఏకంగా విడాకులు తీసుకునే హీరోతో పెళ్లికి సిద్ధమయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తెలుగు బుల్లితెరకు చెందిన రీతూ చౌదరి సోషల్ మీడియాలో చేసేటువంటి రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు.. టిక్ టాక్, షార్ట్ వీడియోలు చేసిన ఈమె స్టార్ గా ఎదిగింది.. దీంతో తనకు బుల్లితెర పైన సీరియల్స్ లో నటించే అవకాశాలు వెలుపడ్డాయి.. అలా మొదటిసారి గోరింటాకు సీరియల్ లో అడుగుపెట్టిన రీతూ చౌదరి తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నది. ఆ తర్వాత ఇంటిగుట్టు అమ్మ కోసం వంటి సీరియల్స్ లో కూడా నటించింది.
ఇలా సీరియల్స్ లో మంచి పేరు సంపాదించుకున్న ఈమె.. జబర్దస్త్ కామెడీ షో లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడే సెట్ అయ్యింది.. తన మొదటి చూపులతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ లేడీ కమెడియన్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.. ప్రస్తుతం జబర్దస్త్ కు దూరంగా ఉన్న ఈమె అప్పుడప్పుడు బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి షోలలో కూడా పాల్గొంటూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె ధరించే దుస్తులను చూస్తే కుర్రాలకు సైతం మతి పోగొట్టేలా ఉంటుంది.
సమయం దొరికినప్పుడల్లా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది రీతు చౌదరి.. తాజాగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటిస్తూ ఉన్న రీతూ చౌదరి.. తన పెళ్లి గురించి ఎక్కువగా ప్రశ్నలు అడిగినప్పుడు తెలుస్తోంది… పెళ్లిపై తన సమాధానాలు వింటే ఈమెకు వివాహం చేసుకొని ఉద్దేశం లేదనేలా కనిపిస్తోంది.. అయితే తాజాగ ఒక నెటిజన్ నాగచైతన్య ను పెళ్లి చేసుకో ఆయన కూడా విడాకులు తీసుకున్నాడు కదా అంటూ కామెంట్స్ చేయడంతో.. ఆ అదృష్టం ఉంటే వెంటనే చేసుకుంటాను ఏమాత్రం మొహమాటం పడకుండా చెప్పేసింది.. రీతూ చౌదరి అందుకు సంబంధించి స్క్రీన్‌షాట్ వైరల్ గా మారుతోంది.