ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారో అందరికీ తెలిసిన విషయమే.. ఒకప్పుడు స్టార్ హీరోలు ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకునేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారిపోయింది.. హీరోలకు మేము కూడా ఏ మాత్రం తీసుకోమంటూ ఓ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం జరుగుతోంది కొంతమంది నటీమణులు… అయితే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఏళ్ళు దాటినా సరే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్స్ మాత్రం కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉంటారు.
అయితే సినిమా ఇండస్ట్రీలో నిన్న కాక మొన్న వచ్చిన రెండు సినిమాలు హిట్ అయితే చాలు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్న సమయంలో ఎప్పుడో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి హని రోజ్.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ మలయాళం ముద్దుగుమ్మ మొదట్లో రెండు సినిమాలు చేసింది.. అవి పెద్దగా సక్సెస్ కాలేదు.. ఆ తర్వాత బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి చిత్రంతో మంచి క్రేజ్ అందుకుంది నటి హాని రోజ్.
దీంతో ఈ ఆమ్మడి పాత్ర ఎంత హైలైట్ గా మారిందో తెలిసిన విషయమే.. హానీ రోజ్ సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది.. కానీ షాపింగ్ మాల్స్ ఈవెంట్స్ కి మాత్రం రోజు రెండు మూడు అయినా సరే చేస్తూ బిజీగా మారిపోయింది.. అందుకు కారణం ఆమెకు సినిమాలో నటిస్తే వచ్చే రెమ్యూనరేషన్ కోటి రూపాయలు కన్నా తక్కువే కానీ ఏదైనా ఈవెంట్ కి షాపింగ్ మాల్ కి వెళ్తే దాదాపుగా రూ .50 లక్షల రూపాయలు ఇస్తారట..
సినీ ఇండస్ట్రీలో సమంత కెరీర్ స్టార్టింగ్ లో కూడా ఇలానే చేసింది.. కేవలం రూ .25 లక్షల రూపాయల చొప్పున తీసుకునేది.. ప్రస్తుతం ఆమె దృష్టి కూడా అడిగినంత ఇస్తున్నట్లు తెలుస్తోంది పలు నిర్మాణ సంస్థలు.. వారానికి కచ్చితంగా మూడు నాలుగు అయినా సరే పలు షాపింగ్ మాల్స్ ని ఓపెన్ చేస్తూ కోట్ల రూపాయలను సంపాదిస్తోంది.