టాలీవుడ్లో సావిత్రి తర్వాత మహానటి సినిమాతో సావిత్రిని మళ్లీ గుర్తు చేసింది హీరోయిన్ కీర్తి సురేష్… ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది..ఈ ఏడాది దసరా సినిమాతో అలరించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండు రోజుల క్రితం భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. కీర్తి కెరీర్ సాఫీగా సాగుతున్న టైంలో చెల్లెలు పాత్రలు చేసి కెరీయర్ని పాడు చేసుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఎందుకంటే కెరీర్ మంచిగా ఉన్నప్పుడే సినిమా ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటూ అడుగులు వేయాలి. కానీ కీర్తి సురేష్ మాత్రం రజినీకాంత్ సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది. ఆ తర్వాత భోళాశంకర్ సినిమాలో కూడా చెల్లెలు పాత్రను పోషించింది.
అయితే కీర్తి సురేష్ ఇప్పుడు ట్రెండీ లో ఉన్న హీరోయిన్ కానీ మొహమాటానికి పోయి చెల్లెలు పాత్రను పోషించటం వల్ల బంగారం లాంటి అవకాశాలన్నీ మిస్ చేసుకుంటోంది. అనవసరమైన ప్రయోగాలు చేస్తూ ఉత్తిపుణ్యానికి కెరీర్ను నాశనం చేసుకుంటున్నది ..మహానటి సినిమా నుంచి కీర్తి సురేష్ బయటికి రాలేదేమో అంతేకాకుండా తెలిసి తెలిసి ఇలాంటి పొరపాట్లు ఎందుకు చేయాలి. దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది.. కానీ ప్రయోజనం ఏంటి ఇంతకు కీర్తి సురేష్ ఎటువైపు అడుగులేస్తోందో కెరియర్లో పాత బ్రేకింగ్ సినిమా వచ్చినప్పుడు ఆ మత్తులో నుంచి బయటకు రావటానికి చాలా టైం పడుతుంది.
అలాగే కీర్తి సురేష్ కూడా అదే మాయలో ఉన్నారేమో సావిత్రి సినిమా వచ్చి ఇప్పటికి కొన్ని సంవత్సరాలు అవుతున్న.. కానీ ఆమె మాత్రం ఆ సినిమా మత్తులోనే ఉన్నారేమో టాలీవుడ్ లో మోడ్రన్ మహానటి గా గుర్తింపు తెచ్చుకొని కెరీర్ పరంగా ఎటువైపు అడుగులెయ్యాలో అర్థం కాలేని పరిస్థితిలో కీర్తి సురేష్ ఉందేమో అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు అలాగే మొహమాటానికి పోయి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తే ఆమె కెరీర్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అంటూ ఆమె ఫ్యాన్స్ వాపోతున్నారు.