టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రికార్డ్ స్థాయిలో ఈయన సినిమాలకు బిజినెస్ జరుగుతుండగా.. ఆమెను అభిమానించే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాల కు పైగానే అవుతున్న ఇప్పటికీ లేడీ సూపర్ స్టార్ గా చలామణి అవుతున్న ఈ ముద్దుగుమ్మకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతూ ఉంటారు. అయితే తాజాగా నయనతారపై సంచలన కామెంట్స్ చేసింది కస్తూరి.
నయనతారను లేడీ సూపర్ స్టార్ గా అంగీకరించలేము అంటూ తాజాగా కస్తూరి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గతంలో పలువురు సెలబ్రిటీల గురించి విమర్శలు చేసిన ఈమె ప్రస్తుతం నయనతారను టార్గెట్ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇకపోతే సౌత్ ఇండియాలో నయనతారను లేడీ సూపర్ స్టార్ గా అంగీకరించలేమని , తమిళనాడు రజినీకాంత్ బిగ్గెస్ట్ స్టార్ అని అక్కడ ఎంత మంది హీరోలు ఉన్నా సరే ఆయన స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యమని కస్తూరి తెలిపింది.
నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని కనడంలో కూడా ఆమె వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు కస్తూరిపై నయనతార అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఇంతలా టార్గెట్ చేయాల్సిన అవసరం నీకు ఏముంది.. అంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో బిజీగా ఉన్న కస్తూరి ఇలా సెలబ్రిటీలపై విమర్శనాత్మకంగా కామెంట్లు చేస్తూ మరింతగా వైరల్ అవుతోంది. ఇకపోతే మరొకవైపు కస్తూరి శంకర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా పెరుగుతూనే వుందని చెప్పాలి. ఏది ఏమైనా కస్తూరి ఇలా ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలకు గురవుతూ ఉండడం గమనార్హం. మరి దీనిపై కస్తూరి ఏ విధంగా వివరణ ఇస్తుందో చూడాలి .