మెగా డాక్టర్ నిహారిక గత కొద్ది రోజుల క్రితం తన భర్త చైతన్యకు విడాకులు ఇవ్వడంతో మరొకసారి ఈమె పేరు వైరల్ గా మారుతోంది. గత నెల నాలుగవ తేదీన తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక మాత్రం పూర్తిగా స్వేచ్ఛగా విహరిస్తూ కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో నిహారిక పైన పలు రకాల ట్రోలింగ్ కూడా వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో నిహారిక పలు రకాల పార్టీలు ఫ్రెండ్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలు వీడియోలను సైతం షేర్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పాటు పలు రకాల జిమ్ వర్కర్లు కూడా చేస్తూ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది నిహారిక. దీంతో గ్లామర్ షో తో కూడా అందరిని ఆకట్టుకునే పనిలో పడింది.. నిహారిక పైన ఈ ఫోటోలను చూసి భారీగానే ట్రోల్ చేస్తున్నారు నైటిజన్స్..
అయితే ఇలాంటివేవీ పట్టించుకోకుండా నిహారిక తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.. ఒకవైపు విడాకుల విషయంలో ట్రోలింగ్ అవుతూనే గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. నిహారిక ఇలా వ్యవహరించడానికి కారణం తనకు ఉన్న సపోర్టే కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. నిహారిక విడాకులు తీసుకున్నప్పటికీ తనకు మాత్రం నిరుత్సాహ పడకుండా తన సోదరుడు వరుణ్ తేజ్ ప్రతి విషయంలో కూడా నిహారిక మద్దతు ఇస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
తన సోదరుడి అండతోనే నిహారిక ఏమాత్రం వెనకడుగు వేయకుండా రోజు రోజుకి ఇలా రెచ్చిపోతూ సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెటీరియల్స్ సైతం తన అన్న అండ తీసుకొని నిహారిక ఇలా వ్యవహరిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. గడచిన కొన్ని నెలల క్రితం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది త్వరలోనే వీరిద్దరి వివాహం కూడా జరగబోతోంది.