అలనాటి హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ జయప్రద గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో తెలుగు తమిళ హిందీ వంటి భాషలలో పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించింది. జయప్రద ప్రస్తుతం సినిమాలలో కాకుండా రాజకీయాల వైపు ఎక్కువగా దృష్టి పెట్టి రాజకీయాలలో చాలా బిజీగా ఉంటోంది. ఇలా రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు బుల్లితెర పైన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉంటుంది జయప్రద.
తాజాగా సీనియర్ నటి జయప్రద ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తరచూ మనం క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము.. కానీ మేము హీరోయిన్లుగా చేసే సమయంలో ఈ పదం అసలు వినబడేది కాదని తెలిపింది. ఇండస్ట్రీలో తమ పనులు తాము చేసుకొని వెళ్లిపోవడం వరకే మాకు తెలుసని తెలిపింది జయప్రద. సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని తెలియజేసింది.
]
అవకాశాలు రావాలి అంటే మనలో టాలెంట్ ఉండాలని జయప్రద తెలిపింది.టాలెంట్ ఉంటే అవకాశాలు కచ్చితంగా వస్తాయని ప్రస్తుతం ఉన్న కాలంలో ముంబైకి చెందినటువంటి ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వీళ్లంతా అవకాశాల కోసం వీళ్ళే డైరెక్టర్లకు నిర్మాతలకు కమిట్మెంట్ ఇస్తూ వారి పక్కలోకి వెళుతున్నారంటూ ముంబై హీరోయిన్ల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
అయితే ఈ విషయంపై కొంతమంది సమర్థిస్తూ ఉండగా మరి కొంతమంది ఈమెకు మద్దతు తెలుపుతున్నారు.ఇటీవల కాలంలో ఎక్కువగా తెలుగు యాక్టర్స్ సైతం బాగానే పాపులారిటీ సంపాదిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో సౌత్ లో నుండి స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారేమో చూడాలి. మొత్తానికి జయప్రద క్యాస్టింగ్ కౌచ్ పైన మాట్లాడడంతో ఈ విషయం వైరల్ గా మారుతోంది.