టాలీవుడ్ లో నాగచైతన్య సమంత గురించి ఏదో ఒక వార్త చెక్కర్లు కొడుతూ ఉంటుంది. అంతేకాకుండా వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కూడా సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లే కారణం అంటూ నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో కూడా బయటపెట్టారు. అయితే ఈ మధ్యనే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి నాగచైతన్య వైపు నుంచి ఒక విషయం బయటపడింది. అదేంటంటే నాగచైతన్య వేరే హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
మరోవైపు సమంత పెళ్లయ్యాక కూడా ఎక్స్పోజింగ్ చేస్తూ సినిమాలు చేయటం వల్లే అక్కినేని ఫ్యామిలీకి నచ్చాక గొడవలు జరిగి విడాకుల వరకు దారితీసాయని సమంత పై ఆరోపణలు వినిపించాయి. అయితే వీటిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టకుండా వైరల్ గా చేస్తున్నారు .అయితే ఓ సినిమా సమయంలో జరిగిన సంఘటన సమంతాను ఎంతగానో బాధ పెట్టిందట. ఆ సినిమా టైంలోనే నాగచైతన్య తో సమంత ఎక్కువగా గొడవపడేదంటు సోషల్ మీడియాలో మరో వార్త వినిపిస్తోంది..
అసలు విషయం ఏంటంటే నాగచైతన్య ,సమంత, దివ్యాంశ కౌశిక్ కలిసి నటించిన చిత్రం మజిలీ. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ కి నాగచైతన్య కి కొన్ని లిప్ కిస్సులు అలాగే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి అయితే అవి సినిమా వరకే పరిమితం అయితే బాగానే ఉండేదని కానీ వారిద్దరి మధ్య ఏదో తేడా కొడుతుందని సమంతా కి డౌట్ వచ్చి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని ఆరా తీసింది.
అప్పుడు బయటపడింది దివ్యాంశ కౌశిక్ ,నాగచైతన్య వీరిద్దరి మధ్య సీక్రెట్ ఎఫైర్ జరుగుతోందని సమంతకి అర్థమయిందట. ఈ విషయాన్ని వెంటనే నాగచైతన్యని అడిగితే అసలు ఒప్పుకోలేదట. దీంతో రోజు గొడవలు జరుగుతూ విడాకుల వరకు దారి తీసి ఇప్పుడు ఎవరికి వారు అయిపోయా రంటు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.