కన్నడ బ్యూటీ టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న రష్మిక మందన్న మొట్టమొదటిగా ఈమె ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి ఎనలేని గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం సినీ రంగంలో పాన్ ఇండియా హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతోంది.తెలుగు ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినప్పటికీ ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది.
రష్మిక ఇప్పుడు పుష్ప 2 సినిమా చేస్తూ బిజీగా గడిపేస్తోంది. పుష్ప సినిమా తీయక ముందు రష్మిక క్రేజ్ ఒకెత్తు అయితే ఇప్పుడు వేరే లెవెల్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. రష్మిక ఒక టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా ఓ వెలుగు వెలుగుతోంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు రకాల యాడ్స్ లలో కూడా చేస్తూ ఉంటుంది. ఇది కాస్త పక్కన పెడితే ఇక సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది.
అంతేకాకుండా తన అభిమానులు తనకు సంబంధించిన ప్రశ్నలు అడిగిన వెంటనే దానికి తగ్గట్టు సమాధానాలు ఇస్తూ ఖాళీ టైంలో వారితో చిట్ చాట్ నిర్వహిస్తూ ఉంటుంది.తాజాగా రష్మికపై ఇప్పుడు ఒక వార్త వైరల్ గా మారుతోంది. తను ఆశతో తొందరపడి కెరీర్ నాశనం చేసుకుంటోందని తెలుస్తోంది. అసలు విషయం ఏంటో ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుందాం.
తను తమిళ స్టార్ అయినా విక్రమ్ తో పాన్ ఇండియా సినిమా చేయాలని చాలా ఆశ పడుతోందట . ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.అయితే విక్రమ్ తో రష్మిక సినిమాలో హీరోయిన్ గా చేయటం ఏంటి బహుశా స్టార్ హీరో అని ఆశ పడుతున్నట్లు ఉంది. ఇలా అయితే ఆమె కెరీర్ ముగిసినట్లే అని అంటున్నారు ఆమె అభిమానులందరూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం అభిమానులను హర్ట్ అయ్యే విధంగా చేస్తోంది.