టాలీవుడ్ ఇండస్ట్రీలోకి జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్.. ఆ తరువాత ఎన్నో సినిమాలను తెరకెక్కించారు.. అయితే నితిన్ సినిమా అన్ని సక్సెస్ బాటనే పడతాయి. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ప్లాప్ లు చవిచూశాడు. ఈ మధ్యనే వచ్చినా మాచర్ల నియోజకవర్గం సినిమా నితిన్ కి బెడిసి కొట్టిందని చెప్పాలి. దాంతో నితిన్ ఖాతాలో ఈసారి ఎలాగైనా హిట్ ఖాతా పడాల్సిందే అని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం నితిన్ చేస్తున్న సినిమా ఎక్స్ట్రా ఈ సినిమాలో హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తోంది. ఇది కాస్త పక్కన పెడితే నితిన్ కి పెళ్లి అయిన సంగతి మనందరికీ తెలిసిందే..ఈ దంపతులు ఇద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ఒక శుభవార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అయితే ఇప్పటికే నితిన్ గురించి పలుమార్లు తండ్రి కాబోతున్నాడు అనే వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలన్నింటిని నితిన్ ఖండించాడు.
అయితే తాజాగా ఇప్పుడు మళ్లీ ఆ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2020లో కరోనా టైంలో నితిన్, శాలిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ని మరోవైపు సినిమా లైఫ్ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలోనే నితిన్ తన మ్యారేజ్ యానివర్సరీ నీ బార్సీలోనా అనే ప్రాంతానికి వెళ్లి రొమాంటిక్ గా ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది శాలిని
ఆ ఫోటోలను దీర్ఘంగా పరిశీలిస్తే శాలిని పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంతో ప్రతి ఒక్కరి ఈ ఫోటోలు చూసి నితిన్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నితిన్ తండ్రి కాబోయే విషయాన్ని మాత్రం హైలెట్ చేస్తున్నారు.
View this post on Instagram