తెలుగు సీనీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఉన్న పేరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పుడు ఏదో ఒక వార్త ఈ కుటుంబం నుంచి వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ కుటుంబం పైన ట్రోల్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.. మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు తర్వాత అంత గుర్తింపు ఎవరికి రాలేదని చెప్పవచ్చు.. మంచు విష్ణు మంచు మనోజ్ ఎంత ట్రై చేసినా స్టార్స్ గా ఎదగలేకపోయారు. అప్పుడప్పుడు పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు.
గత కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని వార్తలు బయటికి వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మంచు మనోజ్ మరొక వివాహాన్ని చేసుకున్నారు. మోహన్ బాబు తర్వాత అంతటి పేరును తెచ్చుకున్న మంచు మనోజ్ తాజాగా ఒక వార్తతో సోషల్ మీడియాలో తన పేరు వైరల్ గా మారుతోంది. ఒక హీరోయిన్ మనోజ్ మీద కోపంతో తాగి రోడ్డు మీద నాన రచ్చ చేసిందట. ఇప్పుడు ఆ విషయంలో మనోజ్ గురించి ఒక వార్త వైరల్ గా మారుతోంది.
మనోజ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లను సైతం పరిచయం చేయడం జరిగింది. అంతేకాకుండా తనకి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ హీరోలు ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తూ ఉంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ,కరెంట్, సింహ వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన స్నేహ ఉల్లాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే స్నేహ ఉల్లాల్ మంచు మనోజ్ మధ్య మంచి స్నేహబంధం ఉండేదట
గతంలో మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా స్నేహ ఉల్లాల్ చాలా గ్రాండ్గా పార్టీ చేయాలనుకుందట.. అందుకోసం ఫ్రెండ్స్ అందరిని పిలిపించి ఒక పెద్ద పార్టీ ఇస్తానని మనోజ్ కూడా చెప్పిందట.అయితే మనోజ్ మాత్రం తన పుట్టినరోజుని తన కుటుంబంతోనే గడపాలి అనుకున్నాడు. దీంతో స్నేహ ఉల్లాల్ అరేంజ్ చేసిన పార్టీకి వెళ్లలేదట. దీంతో కోపంతో రెచ్చిపోయిన స్నేహ ఉల్లా మద్యం మత్తులో నాన్న రచ్చ చేసింది.ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు సైతం అక్కడికి వెళ్లి ఆమెను తీసుకువెళ్లారట. అప్పట్లో ఈ వార్త పెను సంచలనాలను సృష్టించింది. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాల్సి ఉన్నది.