సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఒకవైపు పెళ్లిళ్లు చేసుకోవడం విడాకులు ఇవ్వడం మరోవైపు హీరోయిన్ల కాస్టింగ్ కౌచ్ అంటూ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ విషయంపై అందరి హీరోయిన్స్ పోరాడాల్సిందే కానీ కొంతమంది మాత్రమే ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఇలా వీటన్నింటిని చూస్తుంటే బయట జనాలకి ఇండస్ట్రీ అంటేనే భయమేస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే నటీనటులు రెండేసి పెళ్లిళ్లను చేసుకుని ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్నారు.
టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న నటుడు VK .నరేష్ ఒకప్పుడు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి చెప్పనవసరం లేదు. అంతేకాకుండా ఈ మధ్యనే మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు ఇంకాస్త చేరువయ్యాడు. అయితే నరేష్ గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అందులో ఇద్దరికీ విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అవి జరగటం లేదు.
నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా పవిత్ర లోకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ తన మూడవ భార్య విడాకులు ఇవ్వకపోవడంతో పవిత్రన్ని పెళ్లి చేసుకోలేదు.. కానీ అసలు మూడో భార్యకు ఎందుకు విడాకులు ఇస్తున్నారనే విషయం ఆయన్ని అడిగితే .. నరేష్ మాట్లాడుతూ.. రమ్య తనను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ హింసిస్తోందని నరేష్ చెప్పుకొచ్చాడట.
అంతేకాకుండా తన భార్యను ఉద్దేశించి మరీ మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా చేశాడట. కానీ అది బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.అయితే నరేష్ నటనపరంగా ఎంతో మంచి నటుడు కానీ క్యారెక్టర్ పరంగా తక్కువ స్థాయిలోనే ఉన్నాడని చెబుతూ ఉంటారు. నరేష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.