తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా పేరుపొందిన మీనా ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఈ మధ్యలో తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది మీనా. ముఖ్యంగా ఆమె చేస్తున్న కామెంట్లు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. తన భర్త మరణించినప్పటి నుంచి ఆమె కెమెరా ముందుకి పెద్దగా రావడానికి ఇష్టపడడం లేదు.. గతంలో ఎన్నో ప్రోగ్రామ్స్ సినిమాలు చేసిన మేన ఇప్పుడు పెద్దగా బయటకి రావడానికి ఇష్టపడడం లేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అప్పట్లోనే తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించిన మీన ఆ సమయంలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకుంది. అయితే కూతురు పుట్టాక అనారోగ్య సమస్యతో తన భర్త మరణించడం జరిగింది. ఇక అప్పటి నుంచి మీనా కాస్త సైలెంట్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. కానీ మీనా పైన పలు రూమర్సు మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో మీనా కాస్టింగ్ కౌచ్ పైన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
మా రోజుల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉన్నది.. హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు ఇబ్బంది పెట్టే వారని వారు ఆడవారితో మాట్లాడేటప్పుడు తమ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారని విషయాన్ని గుర్తుంచుకోవాలి అంతేతప్ప ఇలాంటి మాటలు అసలు మాట్లాడుకూడదని తెలియజేసింది మీనా.. హీరోయిన్స్ కూడా పూర్తిగా మారిపోవాలి అవకాశాల కోసం కకృతి పడి ఎలాంటి తప్పుడు పనులు చేయవద్దు అంటూ తెలియజేసినట్టు సమాచారం.
కాస్త ఓపిక పడితే అవకాశాలు వాటి అంతట అవే వస్తాయి మన దగ్గర టాలెంట్ ఉంటే చాలు చాన్సులు కచ్చితంగా మన వల్లే వెతుక్కుంటూ వస్తాయి అంటూ తెలియజేసింది.. కానీ తనకు మాత్రం ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితిలో ఎదురు కాలేదని తెలియజేసింది. మీన ఇప్పటివరకు మంచి మనుషులతోనే సినిమాలను చేశానంటు తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.