టాలీవుడ్ కి మొట్టమొదటిగా అందాల రాక్షసి సినిమాతో పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆ తరువాత రెండు మూడు సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. అయితే నాగార్జునతో నటించిన బంగార్రాజు సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుని.. ఆ వెంటనే నాని తో భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.. ఈ మధ్యనే లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే ..అయితే వీరిద్దరూ మిస్టర్ అనే సినిమాతో పరిచయమై 8 సంవత్సరాలు ప్రేమించుకుని ఇప్పుడు పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారు అయితే ఈ విషయం కాస్త పక్కన పెడితే
చాలామంది హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు ఎంట్రీ ఇవ్వరు. కానీ కొంతమంది పెళ్లయిన తర్వాత కూడా సినీ రంగంలో రాణిస్తూ ఉన్నారు.. అయితే లావణ్య త్రిపాఠి పెద్దింటి కోడలు అవుతోంది కాబట్టి వారు మాత్రం ఏ కండిషన్లు పెట్టలేదట.. కానీ బోల్డ్ క్యారెక్టర్ చెయ్యొద్దు అని మాత్రమే చెప్పారట. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం సినిమాలలో కూడా నటించకుండా తనకు బిజినెస్ అంటే ఇష్టమని తను బిజినెస్మే చేస్తానని తెలియజేసినట్టు సమాచారం.
లావణ్య త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. తనకు భరతనాట్యం అంటే ఇష్టమని అలాగే తనకు చాలా బాగా వచ్చని తెలియజేసింది.. కాబట్టి తను అలాంటి భరతనాట్యం స్కూల్ పెట్టాలని అనుకుంటోందట.తనకు వచ్చిన విద్యను ఇంకాస్త పది మందికి నేర్పించాలని తన కోరికట.అయితే ఇందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు కానీ ఆమెనే మనకు తెలియజేయాలి.
ఏదేమైనా మెగా ఇంటి కోడలుగా మంచి నిర్ణయం తీసుకుందని పెళ్లయిన తర్వాత సినిమాల్లోకి రావడం కరెక్ట్ కాదని వరుణ్ లావణ్య త్రిపాఠి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.