ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు చాలా లేటుగా చేసుకునేవారు. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లను తొందరగా చేసుకుంటున్నారు అలాగే అంతే తొందరగా విడిపోతున్నారు. అయితే అప్పట్లో హీరోయిన్స్ పిల్లల్ని కనే విషయంలో నెగ్లెట్ చేసేవారు.. ఎందుకంటే వారి అందం పోతుందని అలాగే బాడీ షేప్స్ లో మార్పులు వస్తాయని పెళ్లయిన పది సంవత్సరాల వరకు పిల్లల్ని కనేవారు కాదట ..కానీ ఈ మధ్య కాలంలో చాలామంది స్టార్ హీరోయిన్లు పెళ్లి అయిన మూడు నాలుగు సంవత్సరాల లోపే పిల్లల్ని కంటూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు.
ఇప్పటికే ప్రణతి శుభాష్, ఆలియా భట్, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్స్ పిల్లల్ని కనే విషయం బాగా ఆలోచించారు.. అయితే ఈ ఇద్దరి హీరోయిన్స్ విషయం పక్కన పెడితే కాజల్ విషయం తెలుసుకుందాం.. కాజల్ పెళ్లి చేసుకునే టైం లో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న టైంలోనే పెళ్లి చేసుకుంది. ఆ తరువాత పిల్లల్ని కనే విషయంలో కాస్త టైం తీసుకుంటుందేమో అని అనుకుంటే అందుకు విభిన్నంగా కాజల్ చేసింది.
పెళ్లయిన రెండేళ్లలోపే పండంటి బిడ్డకు బాబుకు జన్మనిచ్చి అభిమానులను హవాక్ చేసింది. ఇప్పుడు ఆమె సినిమాల్లో బిజీగా గడిపేస్తోంది. అయితే పిల్లల్ని కనే విషయంలో కాజల్ కూడా కాస్త లేట్ చేయాలనుకుందట. కానీ వారి అత్తామామలు అలాగే అమ్మానాన్నలు అలాంటి విషయానికి ఒప్పుకోలేదట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది జంటలు విడిపోతున్నారు దానికి కారణం వారు కూడా పిల్లలను లేటుగా కనడమే అంటూ చెప్పుకొచ్చారట
అందుకే వీళ్ళు కూడా విడాకులు తీసుకోకుండా వారి కుటుంబం అంతా ఆలోచించి ఎలాగైనా రెండేళ్ల లోపే పిల్లలను కనాలి అంటూ చెప్పారట. దాంతో కాజల్ కూడా ఆలోచించి కరెక్టే కదా అని అనుకుని ఆమెకు నచ్చి పిల్లల్ని కనడానికి ఒప్పుకుందట. ఈ విషయం తెలిసి కాజల్ అగర్వాల్ తీసుకుని నిర్ణయానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.