టాలీవుడ్ లో అతిలోకసుందరిగా పేరుపొందిన హీరోయిన్ శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు తన అందంతో తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత అప్పట్లో అగ్ర హీరోలందరితో నటించింది. ముఖ్యంగా శ్రీదేవి చిన్నతనంలోనే సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టి హిందీ తెలుగు భాషలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తను చనిపోయేంత వరకు మంచి పొజిషన్లో ఉండి డబ్బులు బాగానే సంపాదించుకుంది.
శ్రీదేవి చిన్నప్పటి నుంచి డబ్బులు సంపాదించే మిషన్ లాగే మారిపోయింది.. ఆ తరువాత తన తల్లి మరణించింది.అప్పటినుంచి తన చెల్లిని చూసుకుంటూ తను సంపాదించుకున్న ఆస్తి కోసం కోర్టు చుట్టూ కూడా తిరిగింది. ఆ తరువాత బోనీకపూర్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అత్తారింట్లో అష్ట కష్టాలు పడి తనకి స్థానం కూడా లేకుండా..గౌరవం లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురైందట ..శ్రీదేవి అలాగే తన లైఫ్ని మెల్లమెల్లగా సరిదిద్దుకొని తన స్థానాన్ని తను దక్కించుకుందనే వార్తలు కూడా వినిపించాయి.
బోణి కపూర్ కూడా డబ్బు విషయంలో తనకి రిస్ట్రిక్షన్స్ పెట్టే వాడట.. డబ్బు విషయంలో శ్రీదేవిని బోనీ కపూర్ టార్చర్ చేసేవాడట. తను ఎంత సంపాదించినా ఆయనకే ఇవ్వాలని రూల్ కూడా పెట్టాడట. అంతేకాకుండా ఒకానొక టైంలో శ్రీదేవి డబ్బు లేక అల్లాడిపోయిందని బాలీవుడ్ వార్తల్లో వినిపించాయి. బోనీకపూర్ ఫ్యామిలీ శ్రీదేవిని కాస్త దూరంగా పెట్టేవారట. బోనీ కపూర్ మాత్రం వాటన్నింటినీ పట్టించుకోకుండా తన డబ్బు కోసమే శ్రీదేవిని వాడుకునే వాడట. చాలామంది అతిలోకసుందరి బోనీకపూర్ ను పెళ్లి చేసుకోవటమే ఆమె జీవితంలో చేసుకున్న పెద్ద తప్పు అంటూ అభిమానులు అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటారు.