తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట పటాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న యాదమ్మ రాజు ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. యాదమ్మ రాజుకు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి క్రేజ్ ఉన్నది. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ఇకపోతే యాదమ్మ రాజు స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. ఈమె కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది ఇద్దరు కలిసి సరదాగా వీడియోలను షేర్ చేస్తే అభిమానులను ఆనందపరుస్తూ ఉంటారు. యాదమ్మ రాజు ప్రస్తుతం జబర్దస్త్ షోలో టీం లీడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా యాదమ్మ రాజు భార్య తెల్లవారుజామున యూట్యూబ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది.
ఆ వీడియోలో యాదమ్మ రాజు హాస్పిటల్ కనిపించడం జరిగింది. తన కాలికి సర్జరీ జరగగా పెద్ద కట్టుతో కనిపించారు.తన భార్య స్టెల్లా అతడికి తోడుగా ఉన్నది నడవలేని పరిస్థితిలో ఉన్న యాదమ్మ రాజును చూసి అభిమానులు సైతం చాలా నిరుత్సాహ పడుతున్నారు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటని విషయాన్ని మాత్రం ఈమె తెలుపలేదు. కానీ రాజుని అలా చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తూ ఉన్నారు.
ఎప్పుడు ఎనర్జీడిగా నవ్వించే యాదమ్మ రాజుని ఇలా హాస్పిటల్ బెడ్ పై చూసి అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొంత మంది ఏం జరిగిందో చెప్పండి అంటూ యూట్యూబ్ వీడియో కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి ఏం జరిగిందనే విషయంపై యాదమ్మ రాజు భార్య స్టెల్లా తెలియజేస్తుందేమో చూడాలి మరి ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram