టాలీవుడ్ లో స్టార్ హీరో అల్లు అర్జున్ తో నటించాలని ఎంతోమంది హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే కెరియర్ మొదటి నుంచి అల్లు అర్జున్ సరికొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ తో గతంలో నటించిన హీరోయిన్స్ కొంతమంది మరే సినిమాలలో కూడా కనిపించకుండా కనుమరుగయ్యారు వారి గురించి తెలుసుకుందాం.
హీరోయిన్ గౌరీ ముంజాల్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అల్లు అర్జున్తో బన్నీ సినిమాలో నటించిన వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2008లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తన మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత శ్రీకృష్ణ, గోపి, భూకైలాస్, బంగారు బాబు వంటి చిత్రాలలో నటించింది.. కన్నడ మలయాళం భాషలలో కూడా నటించిన కథల ఎంపికలు పొరపాటు చేయడం వల్ల ఈమె కెరియర్ కు సరైన సక్సెస్ పడలేదు. ప్రస్తుతం ఈమె వ్యాపారాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాలో హీరోయిన్గా నటించిన అనుమెహతా ఈమె కూడా ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరమైంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ తో నువ్వంటే నాకిష్టం అనే సినిమాలో నటించిన ఆ తర్వాత మరి ఎక్కడ కనిపించలేదు.
ఇక డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం వరుడు.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది భాను మెహ్రా.ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ అమ్మడు దీంతో ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఈ మధ్యకాలంలో పలు గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
దీన్నిబట్టి చూస్తే అల్లు అర్జున్ ఏదైనా కొత్త హీరోయిన్ తో సినిమా చేస్తున్నాడు అంటే ఆమెకు ఇండస్ట్రీలు అవకాశాలు రావనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.