సినిమాలో హీరోయిన్గా నటించాలని చాలామంది అమ్మాయిలు కలలు కంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు.అలా ఎంతోమంది ఎన్నో రకాల చేదు అనుభవాలను అనుభవించి సక్సెస్ అయిన వారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు.. కానీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టేటప్పుడు పోర్న్ స్టార్ కావాలని ఎవరు పెద్దగా కోరుకోరు.. ఇలాంటి వారికి సమాజంలో కూడా పెద్దగా గుర్తింపు ఉండదు కాబట్టి ఎవరు ఇలాంటి క్యారెక్టర్ లను యాక్సెప్ట్ చేయరు.
కానీ హీరోయిన్ రెజీనా మాత్రం తాను పోర్న్ స్టార్ అవ్వాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను అని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈమెకి తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికీ.. తమిళ ఇండస్ట్రీలో బాగానే నెట్టుకొస్తోంది. రీసెంట్గా అక్కడ ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రెజీనా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. రెజీనా మాట్లాడుతూ.. తను చేసే సినిమాలలో బోల్డ్ సీన్లు చేయడంపై ఒక ప్రశ్న ఎదురవ్వగా ఆమె ఈ విషయం పైన స్పందించడం జరిగింది.
రెజీనా మాట్లాడుతూ.. నేను గ్లామర్ హీరోయిన్ గా కనిపించడానికి ఇబ్బంది పడను.. నాకు అలా చేయడం చాలా నచ్చుతుంది.. అంతేకాకుండా ఎలాంటి బోల్డ్ సన్నివేశాలలో ఆయన రొమాంటిక్ సన్నివేశాలలో ఆయన నటించగలను.. నేను చిన్న వయసులోనే సినిమా స్టార్స్ కు పోర్న్ స్టార్ కు పెద్ద తేడా తెలియదు.. అప్పుడు కొందరి మాటలు విని నేను కూడా పోర్న్ స్టార్ అవ్వాలనుకున్నాను.. కానీ ఆ తర్వాత పెద్దయ్యాక తనకి పోర్న్ స్టార్ అంటే ఏమిటో తెలిసింది. ఆ తర్వాత ఆ వార్తలు విని షాక్ అయ్యానని తెలిపింది.
అందుచేతనే సినిమాల్లోకి వచ్చాను ఇక్కడ బోల్డ్ సీన్లు చేయడం అనేది కేవలం కథలో ఒక భాగమే.. అందుకే దానిని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటానని తెలియజేస్తోంది రెజీనా. తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన రెజీనా స్టార్ హీరోయిన్గా మాత్రం పేరు సంపాదించుకోలేక పోయింది. ఈ మధ్య పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.