షోలో రెచ్చిపోయిన ముక్కు అవినాష్ గూబ గుయ్యమనిపించిన శ్రీముఖి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎన్నో షోలు వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సినిమాల కన్నా ప్రతి ఏడాది ఏదో ఒక షో రిలీజ్ అవుతోంది. ఈటీవీలో ,జీ తెలుగులో ,మాటీవీలో ఏ చానల్స్ లో చూసిన షోలే కనిపిస్తాయి. ఈ షో ల తగ్గట్టు యాంకర్లు కూడా అలాగే ఉంటున్నారు. చెప్పాలంటే హీరోయిన్స్ కంటే యాంకర్లు ఎందులోనూ తక్కువ కాదని చాలామంది రుజువు చేశారు. అంతేకాకుండా బుల్లితెర యాంకర్లు కూడా ఈమధ్య వెండితెరపై ఎక్కువగానే కనిపిస్తున్నారు.

Sreemukhi | షోలో ముద్దు పెట్ట‌బోయిన అవినాష్‌.. చెంప చెళ్లుమ‌నిపించిన  శ్రీముఖి | Vidhaatha | Latest Telugu News

ప్రస్తుతం బుల్లితెరపై ఫిమేల్ యాంకర్లలో ముందంజలో సుమ తరువాత శ్రీముఖి ఈమధ్య ఆ స్థానంలో ఉన్నది ఈవెంట్స్ ,షోలలో వీరిద్దరే ఎక్కువగా కనిపిస్తూ బాగానే సంపాదించుకుంటున్నారు. శ్రీముఖి తన ఎనర్జిటిక్తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని కడుపుబ్బ నవ్విస్తోంది. ఈ బుల్లితెర రాములమ్మ ఆదివారం విత్ స్టార్ మా పరివార్ అనే షో కి హోస్ట్ గా చేస్తున్న సంగతి మనకు తెలుసు

అందులో తను కొత్త కొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ వారం కమింగ్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ఆసక్తికరంగా ఉండటంతో శ్రీముఖి మళ్ళీ వార్తల్లో నిలిచేలా చేసింది. ఈ ఎపిసోడ్లో ముక్కు అవినాష్ రెట్రో ఓల్డ్ థీయ్ అని టైప్ కాన్సెప్ట్ లో కనిపించారు. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ పాత ఆర్టిస్టులంతా వచ్చి ఆ షోలో తెగ సందడి చేసి ముద్దులతో రచ్చరంబోలా చేశారు.

శ్రీముఖి ప్రోమో మధ్యలో పార్ధు నాకు ఒకసారి వచ్చి ముద్దు పెట్టు అంటూ అవినాష్ షర్టు పట్టుకొని ముందుకు లాక్కుంది. దీంతో మనోడు క్యారెక్టర్ లో లీనమై శ్రీముఖిని ముద్దు పెట్టుకోవడానికి దగ్గరకు జరిగాడు దీంతో శ్రీముఖి స్టైల్ గూబ గుయ్యమనిపించింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Share.