అలాంటి భయంకరమైన వ్యాధితో సతమతమవుతున్న స్టార్ హీరోయిన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా ఇండస్ట్రీలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ కొద్ది రోజుల తర్వాత కనుమరుగవుతారు. ఎంతమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చిన అందులో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్ హీరోయిన్గా నిలబడతారు. అలాంటి హీరోయిన్లలో నందిత శ్వేత కూడా ఒకరు. ఈ అమ్మడు ఆకట్టుకునే అందం అభినయం ఉన్నప్పటికీ సక్సెస్ కాలేక పోయింది.

Nandita Swetha's father breathes his last

ఈ అమ్మడు ఒకప్పుడు సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అనుకోకుండా అవకాశాలు ఆమెకి దూరమయ్యాయి. ఇటీవల బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది.. సోషల్ మీడియా పుణ్యమా అంటూ హీరోయిన్లు దాపరికాలు లేకుండా అన్ని విషయాలను అభిమానుల తో షేర్ చేసుకుంటూ ఉంటున్నారు. సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన చెప్పుకోవటానికి తన అభిమానులు ఎప్పుడూ ఉంటారని చెప్పవచ్చు..

అయితే నందిత శ్వేతా కూడా తన అభిమానులతో ముఖ్యంగా ఒక విషయాన్ని పంచుకుంది. చెప్పాలంటే తన మానసిక బరువును తగ్గిందని తెలియజేస్తోంది. ఈ క్రమంలోనే నందిత శ్వేతా కూడా తాను ఇంతలా బరువు పెరగటానికి తనకి ఒక ఆరోగ్య సమస్య ఉందట. తను ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు చాలా సన్నగా అందంగా కనిపించేదాన్ని.. అయితే ఇప్పుడు మాత్రం చాలా లావుగా కనిపిస్తోంది తనను చూసిన వారంతా నందితాకి ఒళ్ళు చేసింది బాగా అని అనుకునే వారట. కానీ దీని వెనక ఒక ఆరోగ్య సమస్య ఉందని ఎవరికీ తెలియదు

Nandita Swetha in Saree | Photo 5 of 5

నందిత శ్వేతా మాట్లాడుతూ నాకు ఫైబ్రోమయోజియా అనే కండరాలకు సంబంధించిన వ్యాధి ఉంది. ఒకవేళ ఎక్కువ డైట్ చేసిన భారీ వ్యాయామాలు చేసిన నాకు నీరసం కలుగుతుంది. అలాగే ఒత్తిడి సరిగ్గా నిద్ర లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయి. ఈ కారణంగా బరువు పెరిగిపోతాము మళ్లీ ఆ ఒళ్ళు తగ్గటం అంత సులువేమీ కాదు. ఈ వ్యాధి వెన్నుముక కండరాలకు సంబంధించినదని తెలియజేసింది.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ విషయం విన్న అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Share.