ఏ సినీ ఇండస్ట్రీలోనైనా నటీనటుల మధ్య ఎఫైర్ వార్తలు డేటింగ్ వార్తలు చాలా కామన్ గా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి వార్తలను కొంతమంది సీరియస్గా తీసుకొని స్పందిస్తూ ఉంటారు మరికొంతమంది అసలు వీటిని పట్టించుకోరు.టాలీవుడ్ లో నాగశౌర్య ఎప్పుడు విభిన్నమైన కథాంశంతోనే ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నారు. అయితే ఇప్పుడు నాగశౌర్య కాస్త భిన్నంగా ఇలాంటి విషయం పైన స్పందించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నాగశౌర్య వరుస గా సినిమాలు చేస్తూ ఉన్నాడు రీసెంట్గా రంగబలి అనే సినిమాతో యవరేజ్ హిట్ అందుకోవడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ చాలా వెరైటీగా చేయడం జరిగింది.అప్పటి నుంచి ఆయన పేరు బాగా వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో ప్రమోషన్స్ ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన డేటింగ్ రూమర్ల పైన స్పందించడం జరిగింది.. తనకి వివాహం కాకముందు ఇలాంటి రూమర్స్ ఎక్కువగా వినిపించాయి.
ఇందులో ముఖ్యంగా నిహారిక, రాశి ఖన్నా, మాళవిక ఇలా ఏ హీరోయిన్ తో సినిమా చేసిన సరే కచ్చితంగా వారితో ప్రేమలో ఉన్నట్లు లేకపోతే డేటింగ్ చేసినట్లు వార్తలు రాసేవారు కానీ వాస్తవంగా నేను ఏ హీరోయిన్ తో కూడా అసలు డేటింగ్ చేయలేదని తెలియజేశారు. కానీ నిజానికి నాగశౌర్యకి అనుష్క అంటే చాలా ఇష్టమట కానీ ఆమెతో డేటింగ్ చేసినట్లు వార్తలు ఎందుకు రాయరో తెలియట్లేదు ప్లీజ్ అలా రాయండి అంటూ వేడుకోవడం జరిగింది.
అయితే ఈ విషయం తను గతంలో చాలా సరదాగా చెప్పేవాడిని అంటూ గుర్తు చేసుకున్నారు నాగశౌర్య. ఇక తను నటిస్తున్న చిత్రాల గురించి అప్డేట్లను త్వరలోనే ప్రకటిస్తూ ఉంటానని తెలియజేశారు. నాగశౌర్య వివాహం చేసుకొని తన దాంపత్య జీవితంతో బాగా సంతోషంగా ఉన్నారు. ఏది ఏమైనా నాగశౌర్య ఇలా అనుష్క డేటింగ్ అంటూ రూమర్లపై రాయండి అని కోరడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.