సూసైడ్ అటెంప్ట్ చేసిన పూజా హెగ్డే.. కారణం అదేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ముకుందా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు అవకాశాలను అందుకున్నది హీరోయిన్ పూజా హెగ్డే. ఆ తర్వాత DJ,అలా వైకుంఠపురం, మహర్షి సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రాలతో బుట్ట బొమ్మ అనే బిరుదు కూడా వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలతో నటించినప్పటికీ ఏ సినిమా కూడా ఆమెకు పెద్ద హిట్ ను తెచ్చి పెట్టలేదు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆమెని ఐరన్ లెగ్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే తను ఏ సినిమా చేసినా కూడా సక్సెస్ కాకపోవటంతో సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.

Bollywood's New Duo: Akshay Kumar Mentors Pooja Hegde for Spectacular Debut in Housefull-5 Rumors?

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి ఏంటంటే పూజా హెగ్డే సూసైడ్ అటెండ్ చేసుకుందట. అవునా నిజమేనా ..అంటే అవునని అంటోంది బాలీవుడ్ మీడియా..అంతేకాకుండా ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ క్రిటిక్ ఉమైర్ సందు ట్విట్ కూడా చేశాడు. ఈ విషయం చూసిన సోషల్ మీడియా పలువురు నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఉమైర్ సందు ట్విట్ ప్రకారం పూజా హెగ్డే డిప్రెషన్ కి లోన్ అయిందని అలాగే రెండు వారాల క్రితం నుంచి ఇంకాస్త ఎక్కువ డిప్రెషన్స్ కి వెళ్లి ఇలా సూసైడ్ అటెండ్ చేసుకుందని వెంటనే తన పేరెంట్స్ చూడకపోతే తను దక్కేది కాదని.. ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లి తనను బ్రతికించుకున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ మ్యాటర్ పూజా హెగ్డే వాళ్ళ అన్న తన స్నేహితులతో కూడా చెప్పారని ట్విట్ చేయడం జరిగింది.

అయితే ఈ మ్యాటర్ పై పూజా హెగ్డే స్పందించకపోవడంతో నిజంగానే పూజా హెగ్డే సూసైడ్ అటెండ్ చేసుకుందాం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. కాబట్టి దీనిపై పూజా హెగ్డే స్పందిస్తే బాగుంటుందని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది

Share.