బుల్లితెరపై ఓ స్టార్ హీరోయిన్ కి ఉన్న పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ సుమ కనకాల. సుమ సీరియల్స్ లోనూ అలాగే సినిమాలలోనూ అక్కడక్కడ కనిపించింది. ఆ తరువాత బుల్లితెరపై యాంకర్ గా సెటిల్ అయ్యింది. సుమ.. రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే . ఆయన టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు రాజు కనకాల. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా వీరికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు.
వీరిని చూస్తుంటే చాలామంది అనే వారు వీరికి పెళ్లి చాలా సంవత్సరాలు అయ్యిందని వీరిద్దరూ ఇప్పటికీ అన్యోన్యంగానే ఉన్నారు అనేవారట.అయితే ఈ మధ్యనే వారి వైవాహిక జీవితంలో గొడవలు రావడంతో విడాకుల వరకు దారి దారితీస్తోందనే వార్తలు కూడా వినిపించాయి… మొన్నటికి మొన్న సుమ కనకాల విడాకుల వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారడంతో మా ఇద్దరి మధ్య కొన్ని గొడవలు అయితే వచ్చాయి కానీ విడాకులు తీసుకోలేదని తెలియజేశారు..అంతేకాకుండా పిల్లలను చూసి విడాకుల మాటను రద్దు చేసుకున్నాము అంటూ చెప్పుకొచ్చింది. పెద్దలంతా కలిసి మమ్మల్ని అంతవరకు పోనివ్వకుండా ఆపారు అంటూ చెప్పుకొచ్చింది సుమ.
అయితే తాజాగా మరోసారి సుమ తన భర్త రాజీవ్ కనకాలతో గొడవ పెట్టుకుందట. ఆ కారణంగా మళ్లీ వీరి గొడవ తారాస్థాయికి వెళ్లడంతో సుమ తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని తన పిల్లలకు రాసిచ్చిందట. అలాగే తన భర్త ఆస్తిలో తనకు ఎలాంటి హక్కు లేదు అంటూ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పిందట.ఈ విషయాలను ఇండస్ట్రీలో ఉన్న సుమ సన్నిహిత వర్గాలు నుండి వార్తలు వినిపించినట్లు సమాచారం.. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. మరి ఈ విషయం పైన సుమ స్పందిస్తుందేమో చూడాలి మరి.