సినిమా రంగం అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం ఎవరు ఎప్పుడు రాణిస్తారో అంటే కచ్చితంగా చెప్పలేము అని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆకట్టుకునే అందంతోపాటు ఫిజిక్ లుక్ పరంగా అదిరిపోయేలా ఉండాలి పైగా గ్లామర్ ను దాచకుండా ఎక్స్పోజింగ్ చేస్తూ ఉండాలి.అప్పుడే వారికి హీరోయిన్గా అవకాశాలు వస్తూ ఉంటాయి.. కానీ కొంతమంది హీరోలు తమ ఫిజిక్ వల్ల దారుణంగా ట్రోల్ కి గురైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట.
అలాంటి వారిలో హీరోయిన్ ప్రియమణి కూడా ఒకరు. ఈమె కూడా బాడీ షేవింగ్ లకు గురయ్యాను అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియమణినే తెలియజేయడం జరిగింది. తెలుగు,తమిళంలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ప్రియమణి ఎన్నో చిత్రాలలో నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి తెలియజేయడం జరిగింది. ప్రియమణి మాట్లాడుతూ తెలుగులోకి వచ్చిన కొత్తలో తనను చూసి కొంతమంది మూవీ మేకర్స్ చాలా దారుణమైన ట్రోల్స్ చేశారని తెలియజేసింది.
చూడడానికి నల్ల పందిలా ఉన్నావు నువ్వేం హీరోయిన్ అంటూ కూడా దారుణంగా కామెంట్లు చేశారట. ఈ మాటలు విన్న తర్వాత తన మనసుకు చాలా బాధేసిందని కానీ కాన్ఫిడెంట్ మాత్రం తనని ఇక్కడికి తీసుకు వచ్చిందని ఎవరైతే తనను అవమానించారో వారే తనను చూసి అసూయ పడేలా చేశానంటూ తెలియజేసింది ప్రియమణి. గతంలో కూడా తన మీద ఎన్నో రూమర్స్ వినిపించాయి అవన్నీ అసలు పట్టించుకోనని తెలియజేసింది ప్రియమణి.
ప్రియమణి ముస్తఫా ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని విడిపోతున్నారంటూ వార్తలు వినిపించాయి కానీ అవన్నీ రూమర్లే అంటూ కొట్టి పారేసింది. కానీ ప్రియమణిని అవమానించిన వారి పేరు మాత్రం చెప్పలేదు ప్రస్తుతం ప్రియమణి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.