టాలీవుడ్ హీరోయిన్ నిత్యమీనన్ అంటే యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో సైజ్ జీరో వంటి వాటిని మైంటైన్ చేస్తూ ఉంటే ఈ అమ్మడు మాత్రం కాస్త బొద్దుగా మారి కుర్రకారులను మెస్మరై చేస్తోంది. తన అందం అభినయంతో కట్టే పడేసిన నిత్యామీన ఈతరం హీరోయిన్లలలో సౌందర్య అంటూ పిలుస్తూ ఉన్నారు. అదిరిపోయి సైజులను మెయింటైన్ చేయకపోయినా హీరోయిన్గా నటనపరంగా బాగానే ఆకట్టుకుంటూ వరుసగా అవకాశాలను అందుకుంటోంది.
తెలుగు తోపాటు తమిళ్ మలయాళం లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది నిత్యామీనన్. అయితే తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలియజేసింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిత్య మీనన్ అందరూ ఎదుర్కొన్నట్టే తాను కూడా బాడీ షేవింగ్ కామెంట్లను ఎదుర్కొన్నానని తెలియజేస్తోంది.. తాను హీరోయిన్ అయ్యాక మధ్యలో కాస్త బరువు పెరిగానని అప్పుడు తన మీద తప్పుడు ట్రోల్స్ కూడా వచ్చాయని తెలియజేసింది.
ఎవడితోనే డేటింగ్ చేస్తోందని ఇలా ఎవరికి వారి ఏవేవో ఊహించుకున్నారు. కొందరైతే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ అన్నట్లుగా కామెంట్లు చేసేవారు కానీ అసలు ఏమయిందని ఒక్కరు కూడా అడగలేదు కంటిన్యూగా సినిమా షూటింగ్ లు చేయడం వల్ల తను బయట ఫుడ్ ఎక్కువగా తినాల్సి వచ్చిందని దీంతో కాస్త బరువు పెరిగిపోయానని తెలియజేస్తోంది నిత్యా మీనన్.
అది తెలుసుకోకుండా ఎవరికి వచ్చినది వారు రాసేసుకున్నారు. ఆడవారి పైన ఇలాంటివి అనడానికి కొంచెం కూడా ఎవరు ఆలోచించలేదు అంటూ ఎమోషనల్ అయింది నిత్యమీనన్. ఈ మధ్యకాలంలో తెలుగులో ఒక సినిమాలో నటించకపోయిన తమిళంలో మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. భీమ్లా నాయక్ సినిమాతో చివరిగా నటించిన ఈ అమ్మడు ధనుష్ నటించిన తిరు చిత్రంలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.