టాలీవుడ్ లో కార్తికేయ 2 తో మంచి పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మలయాళ బ్యూటీ గా మొదటగా ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత నితిన్ అఆ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. ఆ తరువాత శతమానం భవతి సినిమాలో హీరోయిన్ గా కెరీయర్ని బిజీగా మార్చుకుంది.
గత ఏడాది ఈ అమ్మడికి కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే అంతకుముందే రౌడీ బాయ్ చిత్రంతో కూడా ఈమెకు ప్లస్ పాయింట్ వచ్చింది. ప్రస్తుతం అనుపమ జొన్నలగడ్డ సిద్దు హీరోగా తెరికేక్కిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అగ్ర హీరో అయినా మాస్ మహారాజ్ తో ఈగల్ అనే చిత్రంలో కూడా నటించబోతోంది.
అయితే తాజాగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన సీక్రెట్స్ ను లీక్ చేసింది. గతంలో రామ్ తో ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించాను.. అప్పట్లో నేను రామ్ ప్రేమలో పడ్డానని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.
తాజాగా అనుపమ ఈ ప్రచారాలపై స్పందిస్తూ హీరో రామ్ క్రికెటర్ బూమ్రాతో లవ్ ఎఫైర్ నడిపిస్తున్నానని వార్తలు రాశారు.. కానీ అందులో ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే వాళ్లు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంతే కానీ మా మధ్య ఎలాంటి ప్రేమ కూడా లేదు అని అనుపమ పేర్కొంది. అయితే తను గతంలో ఓ వ్యక్తిని ఇష్టపడ్డానని కానీ ఆ ప్రేమ కాస్త బ్రేకప్ అయ్యిందని తెలిపింది. ఒకవేళ నేను ప్రేమలో పడితే కచ్చితంగా చెబుతానని కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.