తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగుతరకు పరిచయమయ్యింది హీరోయిన్ కంగనా రనౌత్ ..ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ నటించారు. కానీ ఆ తర్వాత పెద్దగా కలిసి రాలేకపోవడంతో బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటించి ఫైర్ బ్రాండ్ గా పేరు పొందింది.కంగనా రనౌత్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రసుగా మారిపోయింది. సినిమాల పరంగా స్టార్ హీరోయిన్ రేంజ్‌ను అందుకున్నప్పటికీ ఎవరు ఊహించలేనంత స్టార్ డం ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
కానీ ఈమె మాట్లాడే మాటలతో బాలీవుడ్లో ఈమెకు మిత్రుల కంటే శత్రువులే ఎక్కువయ్యారు. బాలీవుడ్లో స్టార్ హీరోల మీద చేసే కామెంట్లు ఇమే పైన దుమారానికి రేపేలా చేస్తూ ఉంటాయి. తాజాగా ఇప్పుడు ప్రముఖ నిర్మాత పైన సంచలన కామెంట్లు చేయడం జరిగింది. ఆయన ఎవరో కాదు నిర్మాత కరణ్ జోహార్. బాలీవుడ్ లో డైరెక్టర్ గా నిర్మాతగా మంచి పాపులారిటీ సంపాదించారు ఒకరకంగా ఈయన బాలీవుడ్ లో దిల్ రాజు లాంటి వ్యక్తి అని చెప్పవచ్చు. తాజాగా తన మీద ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.
కంగనా రనౌత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రహ్మాస్త్ర సినిమాని మీరు ఎందుకు విమర్శించారని.. ఒక ప్రశ్న యాంకర్ కంగనా రనౌత్ ను అడగగా.. ఈ సినిమా నిర్మాత కరణ్ జోహార్ చేసే పనులు అలాగే ఉంటాయి అతని సినిమాలకన్నా కూడా ఇతరులతో ఎక్కువగా శృంగారం మీదే ఆసక్తి ఎక్కువ చూపిస్తుంటారని తెలియజేసింది. అతనితో శృంగారం చేస్తేనే వారికి సినిమాలలో అవకాశాలు ఇస్తారంటూ ఫైర్ అయ్యింది కంగనా రనౌత్ .
అంతేకాకుండా ఇతరుల శృంగార జీవితాలను కూడా ఆరాధిస్తూ ఉంటారు.. అలాంటి వ్యక్తి తీసే సినిమాలు గొప్పగా ఎందుకు ఉంటాయి సినీ ఇండస్ట్రీని తప్పుపట్టే వారిని నేను ఎప్పుడూ ఇలాగే విమర్శిస్తూ ఉంటానని తెలియజేసింది కంగనా రనౌత్ . ప్రస్తుతం కంగనా రనౌత్ చేసిన కామెంట్లు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.