300 ఎకరాలు పోగొట్టుకున్న స్టార్ డైరెక్టర్.. ఏమైందంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే నటీనటులు, దర్శక నిర్మాతలు ఒకానొక సమయంలో కష్టాలు పడి ఆ తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. మరికొంతమంది బాగా ఉన్నప్పుడు డబ్బులు కూడపెట్టి ఆ తర్వాత వందల ఎకరాలు లేదా వందల కోట్లు పోగొట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు దశరథ్ కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకొని.. డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు పలు క్రేజీ సినిమాలకు రచయితగా కూడా పనిచేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ఆస్తులకు సంబంధించిన ఎన్నో షాకింగ్ విషయాలను వెల్లడించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దశరథ్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.. నేను చాలా ప్రాక్టికల్ గా ఉంటాను.. ఫ్యామిలీ సర్కస్ మూవీ సమయంలో టైలరింగ్ కూడా నేర్చుకున్నాను. అయితే కటింగ్ అనేది ఎవరూ నేర్పించలేదు. రూ.800 ఇచ్చి మూడు రోజులు కటింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను అని ఆయన తెలిపారు.

ఇకపోతే తన 300 ఎకరాల భూమి పోగొట్టుకోవడం గురించి కూడా మాట్లాడుతూ.. ఆ పొలంలో ఎక్కువ మొత్తాన్ని అడవుల్లో కలిపేశారు అని.. ఇప్పటికీ ఆ భూమి మా పేరు మీదే ఉంటుందని.. వాటిని ఫారెస్ట్ ల్యాండ్ చేయడంతో సాగు చేయలేకపోతున్నామని దశరథ్ చెప్పుకొచ్చారు. ఇకపోతే తమ పొలం తమకు వెనక్కి వస్తే బాగుంటుందని కూడా ఆయన తెలిపారు. మొత్తానికి అయితే దశరథ్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Share.