టాలీవుడ్ పరిశ్రమ కి పరిచయం చేయనవసరం లేని పేరు వేణుస్వామి. ఈయన పలువురు నటీనటులకు పూజలు జ్యోతిష్యం చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు. ఆయనతో పూజలు చేయించుకున్న వారిలో రష్మిక కూడా ఒకరు. ఈమెకు అవకాశాలు తగ్గు ముఖం పట్టడంతో ఆయనతో పూజలు చేయించుకొని ట్రెండింగ్లో ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో వేణు స్వామి పూజలు చేస్తే టాప్ స్టార్ అయినట్లే అనే నమ్మకం ఇప్పుడు ఇంకాస్త బలపడింది.
తాజాగా ఆయన ఖిలాడి, రామబాణం హీరోయిన్ డింపుల్ హయాతి తో పూజలు నిర్వహించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.అయితే వేణు స్వామి పూజ చేసిన దానికంటే అందులో పెట్టిన వైన్ బాటిల్ గురించే ఎక్కువగా వైరల్ అవుతోంది.. ఇటీవలే ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే తో డింపుల్ కి వివాదం జరిగిన సంగతి తెలిసిందే ..కాని దీనిపై వీరిద్దరి తప్ప ఏమీ లేదంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ గొడవల వల్ల మనశ్శాంతి కోసం డింపుల్ పూజ చేయిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
లేదంటే తను చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావటంతో తన జాతకాన్ని తన కెరీయర్ని మార్చుకుందామని పూజలు చేస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా హయాతి కూడా వేణు స్వామితో పూజలు చేయించుకోవడంతో ఈమె అదృష్టం మారుతుందేమో చూడాలి మరి.. డింపుల్ హయాతి సోషల్ మీడియాతో పాటు సినిమాలలో కూడా గ్లామర్ ఒలుకబోస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. తన అందం గ్లామర్ తో పలు చిత్రాలను అవకాశాలు అందుకున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది.
ఇలాగే కొనసాగితే ఈమె కెరియర్ నాశనం అవుతుందని గ్రహించిన డింపుల్ హయాతి ఇలా వేణు స్వామి తో పూజలు చేయిస్తున్నట్లు టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమా అవకాశాలు అందుకోవాలని అభిమానులు సైతం భావిస్తున్నారు.