టాలీవుడ్ లో ఒకప్పుడు తరుణ్ తో ప్రేమాయణం సాగించి దెబ్బతిన్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంది. ఈమె మొదట్లో మంచి మంచి అవకాశాలను దక్కించుకోని ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అతి తక్కువ టైంలోనే పాపులారిటీని సంపాదించుకుంది ఆర్తి అగర్వాల్వెంకటేష్ తో నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఆర్తి అగర్వాల్ కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ఆమె కెరీర్ అంతా స్పాయిల్ అయింది. అప్పట్లో తరుణ్ తో ప్రేమాయణం నడపడం ఒక బ్యాడ్ రిమార్క్ అయితే హీరోయిన్ గా ఇండస్ట్రీలో ముందుకు వెళుతున్న టైంలోనే వెయిట్ ఎక్కువగా పెరగటం ఆమె మైనస్ అయ్యింది. అంతేకాకుండా దాని కోసం సర్జరీ చేయించుకుని తన చావును తానే కొని తెచ్చుకుంది.
ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించింది..ఒకవేళ ఆర్తి అగర్వాల్ బతికి ఉంటే కనుక సినిమాలో హీరోయిన్ అవకాశాలు రాకపోయినా సీనియర్ హీరోయిన్ పాత్రలకైనా సరే సూపర్ గా నటించేదని అభిమానులు భావిస్తున్నారు… హీరోయిన్గా బాగానే అలరించిన ఆర్తి అగర్వాల్.. గోరింటాకు సినిమాతో కాస్త లావుగా అయ్యి ప్రేక్షకుల్ని షాక్ ఇచ్చింది.
ఆ తరువాత అందాల రాముడు సినిమాతో కమెడియన్ సునీల్ తో నటించి కాస్త ఇమేజ్ను తగ్గించుకుంది. అయితే అప్పట్లో ఉన్న హీరోయిన్స్ అందానికి ఇప్పటి హీరోయిన్స్ అందాలకు చాలా వేరియేషన్ ఉంటుందనే చెప్పవచ్చు. ఆర్తి అగర్వాల్ సినీ కెరీయర్ని తానే చేజేతులారా నాశనం చేసుకున్నది. ముంబైకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఆర్తి అగర్వాల్.. ఆ తర్వాత అతని నుంచి విడిపోయి కొన్ని సంవత్సరాలకు సూసైడ్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మరి కొంతమంది సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోయిందనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి.