మెగాస్టార్ చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన రీసెంట్గా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఉపాసన రాంచరణ్ వివాహమైన 11 ఏళ్ల తర్వాత పాప పుట్టడంతో మెగా అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులకు కూడా తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ జంటకి పలువురు అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసనకు సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
ఇండియాలోనే టాప్ 100 బిలినియర్స్లో ఒకరుగా ఉపాసన తాత ప్రతాపరెడ్డి ఉన్నారు. ఆయన అపోలో హాస్పిటల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కాగా మొదటి నుంచి చదువు అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న ఉపాసన తన చదువును పూర్తి చేసింది. కానీ ఆ తర్వాత తాతగారి హాస్పిటల్లో బిజినెస్ పనులలో భాగమై తనదైన స్టైల్ లో ముందుకు వెళుతూ ఉండేది.పలు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొన్న ఉపాసన.. రామ్ చరణ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.
అయితే ఉపాసనాను చరణ్ కంటే ముందు ఒక స్టార్ హీరో వివాహం చేసుకోవాలనుకున్నారట.. అయితే ఉపాసన రాంచరణ్ రిలేషన్ లో ఉన్నారని తెలిసి ఆ హీరో తప్పుకున్నట్లు సమాచారం.. అంతేకాకుండా ఉపాసన చరణ్ కంటే పెద్దది అయినా సరే ప్రేమకి అడ్డురాదు అంటూ వివాహం చేసుకున్నారు. అయితే వీళ్ళతో పాటే కలిసి చదువుకున్న ఒక హీరో ఉపాసనాన్ని చాలా గాఢంగా ప్రేమించారట.
అయితే ఆ హీరో మాత్రం ఈ విషయాన్ని ఉపాసనాకు చెప్పలేకపోయారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ హీరో కూడా ఒక బడా హీరో అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాసన, రాంచరణ్ ఇద్దరు తన జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ సినీ విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ చిట్టిబాబుతో మరొక సినిమాని తెరకెక్కించబోతున్నారు.