యాంకర్ తో ప్రేమాయణం పై క్లారిటీ ఇచ్చిన జెడి చక్రవర్తి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సినీ తారల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వార్తలు నిత్యం ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి వార్తలు వినిపిస్తున్నాయి యాంకర్ విష్ణుప్రియ మీద యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన విష్ణు ప్రియ.. యూత్ లో ఎలాంటి క్రెజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటే చాలు తెగ వైరల్ గా మారుతూనే ఉంటుంది.

VishnuPriya: ఆంటీ ఒప్పుకుంటే ఆ హీరోతోనే జీవితం - విష్ణు ప్రియ..!

తాజాగా విష్ణు ప్రియ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. ఇంటర్వ్యూలో విష్ణు ప్రియ మాట్లాడుతూ తనకు జేడీ చక్రవర్తి అంటే చాలా ఇష్టమని చెప్పి అందరికీ ఆచార్యానికి గురయ్యాలా చేసింది. అక్కడితో ఆకాకుండా అవకాశం వస్తే అతన్ని వివాహం చేసుకుంటానని కూడా స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యల పైన జెడి చక్రవర్తి స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా జెడి చక్రవర్తి విష్ణు ప్రియ గురించి మాట్లాడుతూ తమ మధ్య మంచి అనుబంధంగా ఉందని అది ప్రేమ కాదని తెలియజేశారు. విష్ణు ప్రియ తో కలిసి కేవలం ఒక వెబ్ సిరీస్ లో మాత్రమే నటించానని ఆ సమయంలో జరిగిన సంఘటనను కూడా తెలియజేశారు. వెబ్ సిరీస్ కోసం నేను ప్రియా 40 రోజులపాటు పనిచేశాము.. ఆ సిరీస్ డైరెక్టర్ పవన్ సాదినేని ప్రతిరోజు నేను నటించిన ఒక సినిమా చూడమని విష్ణు ప్రియకు తెలియజేశాడట. దీంతో ఆ చిత్రాలలోని పాత్రలతో ఆమె ప్రేమలో పడింది అంతే తప్ప ఆమె నన్ను ప్రేమించలేదు.. మా ఇద్దరి మధ్య గురువు శిష్యుల మధ్య అనుబంధమే ఉందని తెలియజేశారు.ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

Share.