టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న డైరెక్టర్లలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన డైరెక్టర్ రాజమౌళినే..ఇప్పుడు హీరో పొజిషన్లో ఉన్న డైరెక్టర్ రాజమౌళి సినిమాలతోనే పాన్ ఇండియా లెవల్ కు వెళ్లారు .ఆ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకొని ఎవరు మర్చిపోలేని రేంజ్ కు వెళ్లాడు. అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి ప్రజెంట్‌గా ఇండస్ట్రీలో రాజమౌళి పై ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.
అదేంటంటే రాజమౌళి డైరెక్టర్‌గా కంటే హీరోగా కూడా చాలా బాగున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓ యాడ్ షూటింగ్లో భాగంగా తను హీరోలకు తలదన్నేలా కనిపించాడు. ఆ ఫోటోలను చూసిన వారందరూ రాజమౌళి అచ్చం హీరోలా కనిపిస్తున్నాడు. రాజమౌళి ఏం చేసినా ఆ న్యూస్ అంతా గ్లోబల్ వైడ్ గా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఒప్పో ఫోన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఈ షూటింగ్ విదేశాలలో జరిగింది. ఆ షూటింగ్ ని బాలీవుడ్ డైరెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ రాజమౌళి వైట్ షూట్లో తెల్ల గడ్డంతో ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో మెరిసిపోతున్నాడు.
రాజమౌళి లుక్కుని చూస్తుంటే హీరోల సైతం మతిపోవాల్సిందే చేతిలో ఫోన్ పట్టుకొని అలా నడుస్తూ వస్తుంటే ఆయన దర్శకుల్లా కంటే హీరో లాగే కనిపిస్తున్నాడు. రాజమౌళి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే ఈ యాడ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ యాడ్ చేయటానికి రాజమౌళి హీరోల కన్నా ఎక్కువ పారితోషకం తీసుకున్నాడట రూ.40 కోట్లు అన్నట్లు సమాచారం..దీంతో రాజమౌళి పేరు మారు మ్రోగుతోంది. ఒకప్పుడు డైరెక్టర్‌గా మెరిశాడు ఇప్పుడు ఒప్పో ఫోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. రాను రాను హీరో లాగా కూడా ట్రై చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.