టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా 15 సంవత్సరాలు ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మిల్కీ బ్యూటీగా ఈ ముద్దుగుమ్మని అభిమానులు పిలుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో తెలుగులో కంటే బాలీవుడ్ వైపు ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది తమన్నా.. ఏజ్ అయిపోయిన తర్వాత ఈమె బాలీవుడ్ వెళ్లడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సౌత్ ఇండస్ట్రీలో ఈమెకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు రాలేదు.. అందుకే బాలీవుడ్ వైపు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లవ్ స్టోరీస్-2 లో బోల్డ్ గా నటిస్తోంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే తమన్నా మొదట్లో బాలీవుడ్ లోనే కెరియర్ మొదలుపెట్టిందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఒక సినిమా చేసిన తర్వాత ఈమె సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది.. తాజాగా నటిస్తున్న జి కర్ధా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తమన్నా ఇందులో బాలీవుడ్ గురించి తెలియజేస్తూ పలు సంచలన కామెంట్లు చేయడం జరిగింది.
తమన్నా మాట్లాడుతూ నేను మొదట్లో మోడలింగ్ చేస్తున్నప్పుడు బాలీవుడ్లో అవకాశాల కోసం చాలానే ప్రయత్నించాను కానీ బాలీవుడ్లో తన ప్రైవేటు పార్టీల గురించి చాలా అసహ్యంగా కొంతమంది మాట్లాడారట..ఆ విషయం తనకు నచ్చలేదు.. కొంతమంది తన ఎదభాగాలు సైజులు పెంచుకోవాలంటే కామెంట్లు చేశారు.. దాంతో తనకు చాలా చిరాకుగా అనిపించిందని తెలియజేసింది తమన్నా. అయితే తమన్నాను అలా అవమానించింది కూడా పెద్ద స్థాయిలో ఉన్న వారేనట.
దీంతో తనకు బాలీవుడ్లో అవకాశాల కోసం ట్రై చేయాలనిపించలేదని ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో ఇక్కడే బిజీగా ఉండిపోయాను.. ఆ తరువాతే రియలైజ్ అయ్యాను ఒకరిద్దరూ అలా ఉంటే బాలీవుడ్ ను వదిలేయడం కరెక్ట్ కాదనిపించింది.. అందుకే ఇప్పుడు ఇక్కడ అవకాశాలు వస్తే చేస్తున్నానంటూ తెలియజేస్తోంది తమన్నా. లవ్ స్టోరీస్-2 కూడా విడుదల కాబోతోంది ఈ సిరీస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమన్నా ఇందులో బోల్డ్ గా నటించినట్లు సమాచారం.