గత కొన్ని రోజులుగా నాగచైతన్య గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్ దివ్యాంక కౌశిక్ పేరు ట్రెండింగ్ లో నిలుస్తూనే ఉంది. ఎందుకంటే ఈ ముందుగా ఉన్న నాగచైతన్యత ప్రేమలో ఉందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. నాగచైతన్య, సమంత విడిపోయినప్పటి నుంచి దివ్యాంశ కౌశిక్.. చైతు కూడా రెండు మూడు సార్లు బయట కనిపించినట్లుగా కూడా వార్తలు వినిపించాయి.
గత కొన్ని రోజులుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. గతంలో నాగచైతన్యతో కలిసి మజిలీ సినిమాలో నటించిన దివ్యాంక కౌశిక్ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. కానీ అప్పటినుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ ఉందంటే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయనే వార్తలు ఎక్కువ అయ్యాయని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యాంకా కౌశిక్ ఈ విషయం పైన స్పందించడం జరిగింది.
దివ్యాంక కౌశిక్ మాట్లాడుతూ.. తనకు సంబంధం లేని కొన్ని విషయాలలో ఇష్టం వచ్చినట్లుగా కొంతమంది వార్తలు రాస్తున్నారు. వాస్తవంగా నాగచైతన్య పై నాకు మంచి క్రష్ ఉంది.. ఆయనంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యు చైతు అని తెలియజేసింది.. కానీ ఆయనతో ప్రేమలో మాత్రం లేనని ఇందులో ఎలాంటి నిజం లేదని కూడా తెలియజేసింది.అలాగే తను చాలా హంబుల్ పర్సన్ అంటూ తెలియజేసింది దివ్యాంక కౌశిక్. అందరితో కూడా చాలా కలిసిపోయి స్నేహంగా ఉంటారని తెలియజేసింది.
ఇలాంటి వ్యక్తి గురించి లేనిపోని విషయాలు రాయొద్దు అంటూ తెలియజేసింది దివ్యాంక. ఆమె చేసిన కామెంట్లతో చైతన్యకు ఎలాంటి సంబంధం లేదని అర్ధాన్ని తెలియజేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చైతు ,శోభిత గురించి కూడా గతంలో ఇలాగే వార్తలు వినిపించడంతో ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది.