టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ నిత్యామీనన్ కూడా ఒకరు.ఈమె గుండెజారి గల్లంతయ్యిందే ఇష్క్, ఇలా నితిన్ తో చేసిన సినిమాలన్నీ ఆమెకు మంచి సక్సెస్ సాధించి పెట్టాయి.ఇండస్ట్రీలో ఈమె పొట్టిగా ఉన్న గట్టి పోటీలనే ఇచ్చింది. మిగతా హీరోయిన్స్ లాగా సినిమాల విషయంలో తొందరపడకుండా.. ఆచితూచి అడుగు వేస్తూ గ్యాప్ తీసుకున్న కూడా మంచి సినిమాలను ఎంచుకొని సక్సెస్ లను సాధిస్తోంది..తన కెరీర్ గురించి కూడా అంతే ఆలోచిస్తూ లైఫ్ ని తనకు నచ్చినట్టుగా మలుచుకుంటూ చాలా హ్యాపీగా గడిపేస్తోంది.
నిత్యామీనన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే గడుపుతోంది. ఒకవేళ పెళ్లి ప్రస్తావన ఏవైనా వస్తే ఘాటుగా సమాధానాన్ని తిప్పి కొడుతోంది. అంతేకాదు గతంలో తన పెళ్లిపై వచ్చిన రూమర్స్ కూడా తిప్పికొట్టింది ఈ అమ్మడు. నిత్యామీనన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలను చేసింది. ఇలాంటి వార్తలను ఇండస్ట్రీ నుంచి చాలానే వస్తాయి.కానీ వీటిని చెప్పటానికి నటీనటులు భయపడేవారు. అయితే నిత్యామీనన్ ధైర్యంగా తనకు తెలిసిన విషయాలను చెప్పింది. నిత్యామీననే కాదు ఈమధ్య హీరోయిన్స్ ఈ విషయంపై స్పందిస్తున్నారు.
తాజాగా నిత్యా మీనన్ క్యాచింగ్ కౌచ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలతో పనిచేసే ఎలాంటి ఇబ్బంది కలగలేదు.. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఒక హీరో నా ముందు చాలా అసభ్యంగా వ్యవహరించేవాడు. అంతే కాకుండా ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట ఉంటారు. కానీ వాళ్లని మనం ధైర్యంగా ఎదుర్కొని మనల్ని మనం కాపాడుకోవాలి అంటు తన మాటల్లో చెప్పుకొచ్చింది నిత్యామీనన్. ఈ మధ్యనే తను అడపాదడపా సినిమాలను చేసిన అ సినిమాలు కూడా సక్సెస్ లను దక్కించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ .