టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది.. చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రామ్ చరణ్ ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు.. గత ఏడాది RRR చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఈ సినిమాతో ఇండియన్ హీరోగా పేరు సంపాదించారు. ఒక్కసారిగా రామ్ చరణ్ క్రేజ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయిందని చెప్పవచ్చు.
వాస్తవంగా రామ్ చరణ్ గతంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో కావాల్సి ఉండేదట. అది కూడా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర సినిమాతోనే కావాల్సి ఉండేదట.. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మాత గా వ్యవహరించారు. అయితే ఈ సినిమా చరణ్ కు రెండవ సినిమా కావడం చేత అనుకున్న దానికంటే చాలా పెద్ద హిట్టుగా ఈ సినిమా నిలిచింది. ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన ఈ సినిమా సమయంలో రాజమౌళి ముందుగానే అల్లు అర్జున్ విందుకు తెలియజేయడం జరిగిందట.
ఈ చిత్రాన్ని తమిళ్, మలయాళం, హిందీలో కూడా రిలీజ్ చేద్దామని కానీ రామ్ చరణ్ కు ఇది రెండవ సినిమా ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఆయన ఇమేజ్ తో పాటు చిరంజీవి ఇమేజ్ కూడా దెబ్బతింటుందని అల్లు అర్జున్ అడ్డుపడ్డారట. రాజమౌళికి మాత్రం ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని నమ్మకం ఉండడం చేత అందుకే ఈ సినిమాని రిలీజ్ చేయాలని చిరంజీవి మీద కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టినట్లు అప్పట్లు వార్తలు వినిపించాయి.
కానీ అల్లు అరవింద్ మాటను కాదలేక చిరంజీవి కూడా రాజమౌళికి సర్ది చెప్పడం జరిగిందట. కానీ ఈ సినిమా విడుదల ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం జరిగింది.. రాజమౌళి అప్పటికే ఈ సినిమాని రిలీజ్ చేసే విషయంలో అప్సెట్ గా ఉన్నట్టు తెలుస్తోంది.అందుకే హిట్ అయిన తర్వాత రాజమౌళి ఈ సినిమా గురించి సైలెంట్ గా ఉన్నారని సమాచారం. అప్పట్లోనే ఈ సినిమాని ఇతర భాషలలో విడుదల చేసి ఉంటే రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యేవారు కానీ అల్లు అరవింద్ వల్ల కాలేకపోయారని చెప్పవచ్చు.