మెగా ఇంటి నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. కానీ అమ్మాయిల్లో మాత్రం నిహారికనే మొదటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈమె అడపాదడపా సినిమాలలో నటిస్తూ కాస్త పేరును సంపాదించుకుంది. హీరోయిన్గా మంచిగా సక్సెస్ కాకపోయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే నిహారిక పెళ్లి 2020లో ఘనంగా చేసిన సంగతి తెలిసిందే.. నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య ని నాగబాబు ఏరుకోరి అల్లుడిగా చేసుకున్నారు. ఇప్పటికీ కూడా నిహారిక పెళ్లి గురించి పలు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి..
అయితే ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో ఒక అడుగుపెట్టిన నిహారిక,నాగచైతన్య మూడేళ్లు కాకముందే విడిపోయారని సమాచారం. వారిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి అవి పెరిగి పెరిగి పెద్దగా మారి విడాకులకు దారితీసాయనీ సమచారం. ఈ మధ్య వీరు సోషల్ మీడియాలో కూడా అసలు కనిపించడం లేదు. ఇంస్టాగ్రామ్ లో కూడా వీరిద్దరి పెళ్లి ఫోటోలను తొలగించారు.
ఇది కాస్త పక్కన పెడితే నాగబాబు నిహారికతో మాట్లాడటం లేదట.. దానికి కారణం నిహారిక ప్రవర్తన ఎందుకంటే తన భర్తకు విడాకులు ఇవ్వడం నాగబాబుకు ఇష్టం లేదట. మొదటగా నిహారిక అంగీకారం అడిగి చైతన్య ఇష్టమని చెప్పాకే వీరిద్దరి పెళ్లిని చేశారట. కానీ రెండేళ్లకే విడాకులు తీసుకోవడంతో నాగబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. పైగా చైతన్య ఎంత సర్దుకుందామని చెప్పిన నిహారిక ముందుగా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతోంది ఈ విషయం నాగబాబుకి నచ్చటం లేదట .
అందుకే నిహారికను దూరం పెట్టాడని ఆమెతో అసలు మాట్లాడటం లేదని అంతేకాకుండా ఆమె ఇప్పుడు సినిమాలలో యాక్టింగ్ వదిలిపెట్టి నిర్మాతగా మారింది. ఇప్పుడు నిహారిక మణికొండలో ఒంటరిగా ఉండి తన జీవితంలో నిర్మాతగా అవ్వాలని కోరికను నెరవేర్చుకుంటోందట. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.