పూనకాలు తెప్పిస్తున్న NBK 108 టైటిల్.. బాలయ్యనా మజాకా.!

Google+ Pinterest LinkedIn Tumblr +

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎన్.బి.కె 108 .. ఇదే వర్కింగ్ టైటిల్ తో సినిమాను దాదాపు పూర్తి చేశారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్, శ్రీ లీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగు పనులు శరవేగంగా జరుగుతుండగా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ పై అంచనాలు పెరగగా ఇప్పుడు మూవీ టైటిల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇకపోతే జూన్ 10వ తేదీన బాలయ్య బర్తడే సందర్భంగా రెండు రోజుల ముందుగానే టైటిల్ రిలీజ్ చేయడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పాలి.

Nandamuri Balakrishna In And As Bhagavanth Kesari, NBK 108 Title Announced  Officially | NBK 108 Is Bhagavanth Kesari : అఫీషియల్‌గా బాలకృష్ణ సినిమా  టైటిల్ చెప్పేశారోచ్ - ఇగ మాస్ ఊచకోత షురూ

ఇక తెలుగు రాష్ట్రాలలో 108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్స్ వేశారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి ” భగవంత్ కేసరి “అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం టైటిల్ తో పాటు బాలకృష్ణ కొత్త పోస్టర్ని కూడా రిలీజ్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి పుట్టినరోజు నాడు ఈ సినిమా టైటిల్ను విడుదల చేయబోతున్నారు. ఇక విజయదశమి సందర్భంగా సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి అన్ని ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇక తాజాగా ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మిస్తున్నారు.

ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారట. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే . మొత్తానికైతే ఈ సినిమాతో మరో విజయాన్ని ఆయన తన ఖాతాలో వేసుకోబోతున్నట్లు సమాచారం.

Share.