తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఈశ్వర్ సినిమాతో పరిచయమై ఆ తరువాత ఎన్నో సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న హీరో ప్రభాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే ఉన్నాయి. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు ప్రభాస్. అమ్మాయిలకు ప్రభాస్ అంటే పిచ్చి ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు థియేటర్ల ముందు క్యూ కడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ పై ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటపడింది. అదేంటంటే ఆయనకు ఇష్టమైన ఫుడ్ చూడగానే పక్కన ఎవరున్నా కూడా పట్టించుకోకుండా ప్లేట్ మొత్తాన్ని ఖాళీ చేస్తాడట. అంతేకాదు ఆయన ఇంటికి వచ్చిన వారికి కడుపునిండా భోజనం చేసేంతవరకు వదిలిపెట్టడటని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ఏదైనా షూటింగ్ టైంలో క్యారియర్లు సర్దేసి అక్కడున్న వారందరికీ కడుపునిండా భోజనాలు పెడతాడట. ముఖ్యంగా ప్రభాస్ కు ముక్క లేనిదే ముద్ద కూడా దిగదట. ప్రభాస్ కి అంత ఇష్టమట నాన్ వెజ్ అంటే
కానీ ఇందులో ముఖ్యంగా రొయ్యలు పులుసు అంటే ప్రభాస్ కి కంచం కూడా నాకేస్తాడట. చిన్నప్పుడు రొయ్యల ఫ్రై లేనిదే అన్నం కూడా తినేవాడు కాదట. రొయ్యల ఫ్రై చేసిన తర్వాతే ముద్ద ముట్టేవాడట అంత ఇష్టమట. డైటింగ్ అలాంటివేవీ ఆ టైంలో పట్టించుకోడట ప్రభాస్. అయితే ఈ విషయం ప్రభాస్ అభిమానులకి తెలిసి .. ప్రభాస్ కి రొయ్యలు అంటే అంత ఇష్టమా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడు ఆది పురుష్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి మరి ఈ సినిమా ఈనెల 16వ తేదీన విడుదల కాబోతోంది.